- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమలో పడితే నాలుగేళ్లల్లో లావెక్కే చాన్స్ ఎక్కువ..! ఎందుకంటే..
లవ్ అండ్ కమిటెడ్ రిలేషన్స్‌లో ఉన్న జంటల్లో, ముఖ్యంగా మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంటోంది.

దిశ, ఫీచర్స్ : అధిక కేలరీలు తీసుకుంటే అధిక బరువు పెరుగుతారని అందరికీ తెలిసిందే. కానీ ప్రేమలో పడిన వాళ్లు కూడా లావెక్కుతారంటే నమ్ముతారా?! కానీ ఇది నిజంగా.. నిజం! సింగిల్స్‌తో పోలిస్తే ప్రేమలో ఉంటూ కమిటెడ్ రిలేషిప్ కొనసాగిస్తున్నవారు ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నట్లు, అధిక బరువు పెరుగుతున్నట్లు మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
లవ్ అండ్ కమిటెడ్ రిలేషన్స్‌లో ఉన్న జంటల్లో, ముఖ్యంగా మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రేమలో పడిన నాలుగేండ్లల్లో ఈ సమస్య ఎదురవుతోంది. స్త్రీలు భాగస్వామితో కలిసి ఉండటం, కలిసి తిరగడం, కలిసి తినడం ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే ఊబకాయం ప్రమాదం పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. పురుషుల విషయానికి వస్తే ఇది రెండు సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నది.
కారణం ఏమిటంటే..
వాస్తవానికి ప్రేమలో పడిన నాలుగేళ్లల్లో ఊబకాయం రావడానికి ప్రధాన కారణం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే అంటున్నారు అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు. ఎందుకంటే లవ్ అండ్ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఆహారాలు ఎక్కువగా పంచుకోవడం, రకరకాల రుచులను ఇష్టపడటం, తరచుగా తినడం, స్నేహితులు-కుటుంబంతో కలిసి ఎక్కువ కేలరీలు తీసుకోవడం వంటివి సహజంగానే జరిగిపోతాయి. అంతేకాకుండా సంబంధంలో సేఫ్‌గా, సంతృప్తిగా ఉన్నప్పుడు డైట్, వ్యాయామం పట్ల ఫోకస్ తగ్గుతుంది. దీంతో బరువు పెరగడం, ఊబకాయం రావడం సహజంగానే జరిగిపోతుంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సంతోషంగా జంటలు, అసంతృప్తిగా ఉన్న జంటలు ఇద్దరూ బరువు పెరుగుతారు. కానీ వేర్వేరు మానసిక కారణాల వల్ల!






