- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blockbuster Pongal.. సంక్రాంతికి వస్తున్నాం.!
పండక్కి ఊరొస్తున్నాం రెడీగా ఉండండి.!

ఊరు..
అమ్మలాంటిది.!
పెరిగి.. పెద్దయి ఎక్కడో ఉండిపోతాం.
ఇక పెండ్లయితే బేడీలే.
పిల్లలే సర్వస్వం.
పనే ప్రపంచం.
కానీ..
ఎప్పుడో ఒకసారి ఊరబాట పట్టినప్పుడు..
ఊరును చూస్తే కంటి చెమ్మ కాలువలా దుంకుతుంది.!
ఉన్న ఊరుకు సాటి ఏదీ లేదనిపిస్తుంది.
అలాంటి సందళ్లు.. సంతోషాల సమాహారం సంక్రాంతి.
ఈ పండక్కి ఊరొస్తున్నాం రెడీగా ఉండండి.!
ఊరెళ్లిపోతా మామా.. ఊరెళ్లిపోతా అనుకుంటూ బ్యాగులు సర్దేసుకొని సంక్రాంతి సంబరంలో ఊరిబాట పడుతున్నారు జనాలు. చూస్తూనే ఉండండీ ఇంకో రెండ్రోజుల్లో హైదరాబాదంతా ఖాళీ అయిపోతుంది. స్కూళ్లకు.. కాలేజీలకు సెలవులొచ్చాయి కాబట్టీ ఇక ఆగుతారా.? సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే' అంటూ ఊర్లకు సంక్రాంతి శోభను తీసుకొస్తున్నారు.!
మీ ఇంటికి మేం కాపలా
చాలా చూస్తుంటాం. ఊరెళ్లగానే ఇల్లు చోరీ.. తీర్థయాత్రలు తిరిగొచ్చేసరికి దొంగల భీభత్సం.. అనీ. ఇక సంక్రాంతికి ఇలా వెళ్లి అలా వచ్చేది కాదాయె. ఎంతలేదన్నా వారం రోజుల సెలబ్రేషన్స్. వేరే వేరే ప్రాంతాల్లో సెటిలై సొంతూళ్లకు వెళ్తున్న వాళ్లను అలర్ట్ చేసింది పోలీస్ డిపార్ట్‌మెంట్. మీరు ఊరెళ్తే మాకు సమాచారమివ్వడి.. మీ ఇంటికి మేం కాపలా ఉంటామంటోంది. ఇంట్లో ఉండే సొమ్ములు.. పైసలను బ్యాంకుల్లో తీసుకెళ్లడంగానీ.. లేదా వెంట తీసుకెళ్లడంగానీ బెటర్ అంటున్నారు. “Home is not a place…it’s a feeling” బీ అలర్ట్.!
అమ్మానాన్న.. సంక్రాంతి.!
ఊరికి చేరుకోగానే ఫస్ట్ అమ్మానాన్నను చూసి మురిసిపోతుంటాం. ఎందుకంటే వాళ్లొక ఎమోషన్. ఈ బిజీ లైఫ్‌లో దొరికిన ఈ కాస్త సమయాన్ని వారితో గడిపితే జన్మ ధన్యమైనట్టే. కొందరు ఊరికి వెళ్లి కూడా అదే చికాకు.. అదే గజిబిజీగా కనిపిస్తుంటారు. చూడు బాస్.. ఎన్నాళ్లయ్యింది అమ్మ ఒళ్లో తలవాల్చక.?ఎన్నేళ్లయ్యిందో నాన్న చెయ్యి పట్టుకొని నడవక.? ఎందుకీ చికాకులు..? అన్నీ పక్కకుపెట్టి అమ్మానాన్నల ప్రేమను ఆస్వాదిస్తే సంక్రాంతి ఇంకాస్త సందడిగా ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత.. అమ్మానాన్న స్పర్శతో మనసెంత పులకరిస్తుందో ఊహించుకుంటేనే అదో కిక్కుంది. “The love of parents is life’s greatest blessing” డోంట్ మిస్.!
అమ్మచేతి అప్పాలు
అన్ని పండగలో సంక్రాంతి వెరీ స్పెషల్. ముచ్చటగా మూడు రోజులుంటుంది కదా. భోగిమంటలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల పద్యాలు ఇలా చాలా ఉంటాయి. ఇక పిండి వంటలదైతే హైలైట్. తీరొక్క వంటలతో సంక్రాంతికి స్పైసీ ఘాటెక్కుతుంది. సిటీల్లో రకరకాల స్టాటర్ల్స్.. ఫాస్ట్‌ఫుడ్.. జంక్‌ఫుడ్ తిని హెల్దీ ఫుడ్‌కు దూరమై ఉంటార్లేండి. అమ్మచేతి వంట రుచి చూడక ఎన్నిరోజులైందో పాపం. ఊర్లో ఉన్నన్ని రోజులు మీ పాకశాస్త్ర పైత్యాన్ని పక్కకు పెట్టి.. కాస్త అమ్మచేతి వంటను ఆస్వాదించండి. హ్మ్.. అమ్మచేతి వంట అనగానే నీళ్లూరుతున్నయ్ బాస్.. "Appreciate the food your Mother cooks for you.. Some don’t have food, others don’t have Mothers" కుమ్మేయండీ.!
నాన్నమ్మ.. తాతయ్యతో..
పండక్కి ఎంజాయంటే పిల్లలదే. ఆటలు.. పాటలు.. డ్యాన్సులతో ఫుల్లు బిజీ. కానీ ఇప్పటి పిల్లలకు ఆటలంటే ఆన్‌లైన్ గేమ్సే. మీరు వెళ్లింది పండగకు సార్. మీ సంబరాల్లో మీరు మునిగి వాళ్లను మటుకు ఫోన్లకు.. టీవీలకు పరిమితం చేస్తారా ఏంటి.? బయట తిప్పండి. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో అటాచ్ చేయండి. పిల్లలతో స్పెండ్ చేశామన్న సంతృప్తి వాళ్లకుంటుంది. పెద్దలతో పంచుకునే ఛాన్స్ పిల్లలకూ దొరుకుతుంది. మార్కులు.. గ్రాండ్ టోటల్సే కాదు.. గ్రాండ్ పేరెంట్స్ టచ్ కూడా అవసరమే అని తెలుసుకునే అవకాశం కల్పించినట్లవుతుంది. “Parents know a lot, but grandparents know everything” ఎంజాయ్.!
స్నేహమేరా జీవితం
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లు కాకుండా ఫుల్టూ బిందాస్ అయ్యే ఛాన్స్ పండగ ఇస్తుంది. మరి బోర్‌గా ఫీలవ్వడమెందుకు.? ఇంటికే అతుక్కుపోకుండా ఊరి ఫ్రెండ్స్‌ని కలుసుకోండి. మీతో కలిసి పెరిగిన స్నేహితులతో మళ్లీ కలిస్తే పండగకే అందమొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ దొరుకుతుంది. బచ్‌పన్‌ల ఆడిన గిల్లిదండా.. కబడ్డీ.. బొంగరాలు.. పతంగులాట మళ్లీ ఆడితే ఆట మస్తు కమ్ముతుంది. పతంగులంటే గుర్తుకొచ్చింది.. చైనా మాంజాకు దూరముంటే మంచిది. మాంజా కోసుకొని ముక్కులు.. మూతులు తెగుతున్నాయి. "Old friends are the best antiques" బీ కేర్ ఫుల్.!
సకుటుంబ సంబరం
ఉత్సాహంతో ఊరెళ్లి అక్కడ కూడా తోటి కోడళ్ల పంచాయతీలు.. అన్నదమ్ముల గెట్టు పంచాయతీలు పెట్టుకుందామా బ్రో.? అవన్నీ మర్చిపోయి ఎంచక్కా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అదే సంక్రాంతి. అన్నదమ్ముండ్లు.. అక్కాచెల్లెండ్లు అందరూ కలిసిపోయి ఒక గ్రూప్ ఫొటో క్లిక్‌మనిపిస్తే లైఫ్‌లాంగ్ గుర్తుంటుంది. వీలైతే చుట్టాలనూ కలిసి వాళ్లింట్లో ఒకపూట భోజనం చేస్తే మేనత్తలు.. మేనమాల అనుబంధమేంటో తరతరాలకు తెలిసొస్తుంది. పండగంటే ఇదే కదా.? ఓన్లీ మనమే లోన్లీగా మూడు పూటలా తిని పడుకుంటే పండగ కాదు.. ఏండ్లనాడు పాశిపోయిన తొవ్వలను కలపడమే అసలైన పండగ. “The most important thing in the world is family and love” చిల్ బ్రో.!
ఫోన్లో మునగొద్దు
ఆత్రమాత్రంగా ఊరెళ్లి అక్కడ కూడా ల్యాప్‌టాప్ ముందేసుకొని.. గంటల కొద్ది ఫోన్లో మాట్లాడితే చూసేవాళ్లకు కూడా చిరాగ్గా ఉంటుంది. ఓ ఐదారు రోజులు వాటిని పక్కకు పడేసి డ్రై డేస్ పాటిస్తే మంచిది. ఏ ఫోన్లూ.. కీబోర్డ్ కటకట చప్పుళ్లూ లేకుండా హాయిగా ఫెస్టివ్ మూడ్‌లో ఉండండి.!
పొలంబాట
కాంక్రీట్ జంగల్‌కు అలవాటు పడి పొలాలనేవి గుర్తున్నాయా అసలు.? పండగ రోజులు పొద్దున్నే పొలంబాట పడితే ఎంత బాగుంటుంది. అక్కడే స్నానంచేసి.. గట్టుమీద కూర్చొని ముచ్చట్లు పెడితే ఆహా ఎలా ఉంటుందో.? పక్షుల కిలకిలలు.. యేటి గలగలలు వింటూ నేచర్‌ని ఎంజాయ్ చేయండి.!
లాస్ట్ వన్.. ఊరికి ఎలా వెళ్లారో అలా టాటా చెప్పి సేఫ్‌గా వచ్చేయండీ. అన్ని రోజులు అందరితో కలిసి పండగను ఆస్వాదించి ఒక్కసారిగా రావాలంటే కొంత అయిష్టంగానే ఉంటుంది. కానీ.. బతుకు పోరాటంలో తప్పదు కదా.?
So.. go safely and return safely.. Advance Happy Pongal..!!






