- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Peeing: స్నానం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఇది తప్పక చదవండి!
Peeing in the Shower Good or Bad: ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

దిశ, వెబ్‌డెస్క్: Peeing in the Shower Good or Bad: ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
స్నానం చేస్తున్నప్పుడు పీ చేయడం చాలామందికి కామన్ అలవాటే. 'ఇందులో ఏముందీ? టాయిలెట్‌కు వెళ్లాల్సిన పని మానిపోతుంది, నీరు కూడా ఆదా అవుతుంది' అనుకుంటారు. నిజానికి, ఒక సర్వే ప్రకారం 80శాతం బ్రిటిష్ ప్రజలు స్నానాల సమయంలోనే మూత్రం పోయడం కామన్ అని అంగీకరించారు. దీని వల్ల సంవత్సరానికి 4,000 లీటర్ల నీరు ఆదా అవుతుందని అంచనా. అంతేకాకుండా, యూకేలో ప్రతి ఏడాదికి £426 మిలియన్ (రూ. 4,500 కోట్లు) విలువైన నీటి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అయితే, దీని వెనుక ఆరోగ్య పరంగా, హైజీన్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయనే చెప్పాలి. నిజంగా ఇది మంచిదా? లేకపోతే దీని వల్ల ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా?
హాని కలుగుతుందా?
నిపుణుల మాట ప్రకారం, స్నానం చేస్తూ పీ చేయడం మన పెల్విక్ ఫ్లోర్ కండరాలకు (Pelvic Floor Muscles) సమస్యను కలిగించొచ్చు. మనం సాధారణంగా టాయిలెట్‌లో కూర్చొని పీ చేసినప్పుడు, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతుంది. కానీ, నిల్చొని లేదా బాత్‌రూమ్ ఫ్లోర్‌పై నిలబడి పీ చేయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా మిగిలిపోవచ్చు. దీని వల్ల పెల్విక్ ఫ్లోర్ వీక్ అవ్వడం, మెల్లగా మూత్రం లీక్ అవ్వడం (Urinary Incontinence) లాంటి సమస్యలు రావచ్చు.
అంతేకాదు, స్నానం చేస్తున్నప్పుడు నీటి శబ్దం వింటూ పీ చేస్తే, దీని వల్ల నీటి శబ్దం విన్నప్పుడల్లా మూత్ర విసర్జన చేయాలనే అలవాటు ఏర్పడుతుంది. దీని ప్రభావం ఏంటంటే, బయట ఎక్కడైనా నీరు కారుతున్న శబ్దం, వర్షం, లేదా వాష్‌బేసిన్‌లో నీరు పడుతున్న శబ్దం విన్నా పీ చేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దీన్ని వైద్య నిపుణులు 'Conditioned Reflex' అంటారు. దీని వల్ల అసలైన అవసరం లేకపోయినా పీ చేయాలనిపించడం, అలాగే మూత్రాశయంపై అదనపు ఒత్తిడి రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇది పురుషులకు, మహిళలకు ఎలా భిన్నంగా ఉంటుంది?
పురుషులు సాధారణంగా నిల్చొని పీ చేయడంలో ఆచారపరంగా, శరీర నిర్మాణపరంగా అలవాటు అయిపోతారు. కానీ, మహిళలు నిల్చొని పీ చేయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), మూత్రాశయ రాళ్లు (Bladder Stones), కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే, మహిళలకు పెల్విక్ ఫ్లోర్ వీక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పురుషులకు ప్రొస్టేట్ గ్రంథి సహాయం చేస్తుంది, కానీ మహిళలకు అలాంటి సహాయక వ్యవస్థ ఉండదు.
హైజీన్ పరంగా ఏమిటీ సమస్యలు?
చాలామంది మూత్రం అంటే బ్యాక్టీరియా ఉండదు, అది స్టెరైల్ అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ, శరీరాన్ని వదిలే సమయంలోనే మాత్రమే పీ స్టెరైల్‌గా ఉంటుంది, కానీ అది శరీరంపై లేదా బాత్‌రూమ్ ఫ్లోర్‌పై పడిన తర్వాత అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఇంట్లో అందరూ ఒకే బాత్‌రూమ్ ఉపయోగిస్తే, పీ పడిన ప్రదేశాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే కొన్ని ఇన్‌ఫెక్షన్లకు కారణం కావచ్చు. అంతేకాకుండా, నీరు, సబ్బు వాడుతున్నప్పుడు కూడా బాక్టీరియా, మూత్రంలోని ఖనిజాలు (Uric Acid, Ammonia) బాత్‌రూమ్ ఫ్లోర్‌పై పేరుకుని, గందంగా మారే అవకాశం ఉంటుంది. దీని వల్ల బాత్‌రూమ్ వాడే ఇతరులకు కూడా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది.
ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, పెల్విక్ ఫ్లోర్ వీక్ అవ్వడం, మూత్రం లీక్ అవ్వడం, నీటి శబ్దం వింటూనే పీ చేయాలనే అలవాటు ఏర్పడడం, హైజీన్ సమస్యలు రావడం ఇవన్నీ దీని వల్ల సంభవించవచ్చు.






