- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఆమెకు తల్లి లేదు.
తండ్రి లేడు.
నా అన్నవాళ్లెవరూ లేరు.
16 ఏళ్లుగా అనాథ ఆశ్రమంలో ఉంటోంది.
చదువు పూర్తయింది.
పెళ్లీడుకొచ్చింది.
ఎలా మరీ..?
అమ్మ లేకపాయె.. నాన్న లేకపాయె.?
నేనున్నానని ముందుకొచ్చాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్.
పెళ్లి పెద్దగా మారి.. ఆ పేదింటి అమ్మాయి కాళ్లు కడిగి..
కన్యాదానం చేయడానికి ముందుకొచ్చాడు.
- దిశ, ఫీచర్స్
కలెక్టరేట్ ప్రాంగణంలో పెళ్లి
రామగుండంలోని తబిత ఆశ్రమంలో ఉంటున్న అనాథ బిడ్డ మానస డిగ్రీ పూర్తిచేసింది. జనగామ జిల్లా రాజేశ్‌తో మానసకు పెళ్లి సంబంధం కుదిరింది. తల్లిదండ్రులు లేకపోవడంతో "కన్యాదానం చేసుడు" సమస్యగా మారింది. ఈ విషయం జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాలరావు దృష్టికి వెళ్లింది. విషయం కలెక్టర్ శ్రీహర్షకు చెప్పారు. అయ్యో అవునా అని స్పందించిన కలెక్టర్.. ఈ పెళ్లికి ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. పెళ్లిని అధికారికంగా కలెక్టరేట్ ప్రాంగణంలోనే జరుగుతుంది.
మానస పెళ్లికూతురాయెనే
పెళ్లంటే ఇయాలరేపు ఎన్ని ఉంటున్నాయో చూస్తున్నాం కదా.? అవన్నీ మానస పెళ్లిలో కనిపిస్తాయి. తల్లిదండ్రి లేని లోటు కనిపించొద్దని అన్ని ఏర్పాట్లు చేస్తు్న్నారు. సాంప్రదాయబద్దంగా పెళ్లి పత్రికలు ముద్రించారు. పెద్దపల్లి జిల్లా వారి పెళ్లి పిలుపు అని ఆహ్వానిస్తున్న ఆ పత్రికలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. కలెక్టర్ పేరుతోనే వివాహ పత్రికలు ముద్రించడంతో అందరూ మానస పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. మానసకు తల్లిదండ్రులు లేరు అనే ఆలోచనే రాకుండా సొంత బిడ్డ వేడుకలా కలెక్టర్ అన్ని పనులు చూసుకుంటున్నారు.
మర్చిపోలేని అనుభూతి
జిల్లా కలెక్టరే స్వయంగా తన పెళ్లి జరిపించడం మానస అదృష్టం అనుకోవాలి. ఎవరూ లేరనే బాధ ఉంటది కదా.? మిగతా సందర్భాల్లో ఏమోగానీ పెళ్లివేళ ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘట్టం ఎవరూ లేకపోయినా అధికారులే కుటుంబ పెద్దలా చూసుకోవడం మానస భావోద్వేగానికి గురైంది. అనాథగా పుట్టినా.. ఈ స్థాయిలో పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని పెళ్లివేళ ఎమోషనైంది. అమ్మానాన్న ఉన్నవారికి కూడా ఇంత గౌరవంగా పెళ్లి జరగదు.. ఈ ఆశ్రమం నాకు కుటుంబం. అధికారులే నా అమ్మానాన్న.. తోబుట్టువులు అనీ.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టం ఇది అనీ అన్నది.






