Virla news: 'అన్నీ భరించడానికి అడవి అంటే అమ్మ కాదు అమ్మోరు'.. HCU భూముల వివాదం వేళ పవన్ కళ్యాణ్ డైలాగ్ వైరల్

by Vennela |   (  Updated:2025-04-02 05:14:24  IST  )

Virla news: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4వందల ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Virla news: అన్నీ భరించడానికి అడవి అంటే అమ్మ కాదు అమ్మోరు.. HCU భూముల వివాదం వేళ పవన్ కళ్యాణ్ డైలాగ్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: Virla news: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4వందల ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీ అట్టుడికిపోతోంది.

అంతేకాదు హెచ్ సీయూ భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భూముల అంశంపై విద్యార్థుల ధర్నాతో హెచ్ సీయూలో రోజంతా హైటెన్షన్ నెలకొంటుంది.విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు పలికాయి. వన్యప్రాణులను చంపి కాంక్రీట్ జంగిల్ లా మారుస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ వైరల్ అవుతోంది.

అడవి అంటే అమ్మకాదురా..నువ్వేం చేసినా భరించడానికి అమ్మోరు. కన్ను తెరిచిందా..ప్రతి కొమ్మా విల్లు అవుతుందని భీమ్లా నాయక్ మూవీలో పవన్ కల్యాణ్ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అదే డైలాగ్ ను హెచ్ సీయూ భూముల వివాదానికి లింక్ పెడుతూ సేవ్ హెచ్ సీయూ బయోడైవర్సిటీ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Next Story