- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ పార్ట్‌నర్ చెప్పే అబద్ధాలను ఈ చిట్కాలతో ఈజీగా కనిపెట్టేయండి!
మీ పార్ట్‌నర్ చెప్పే అబద్ధాలను ఈ చిట్కాలతో ఈజీగా కనిపెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో మీరు తెలుసుకోండి.

దిశ, ఫీచర్స్: ఏ సంబంధానికైనా నమ్మకమే బలమైన పునాది. ముఖ్యంగా భార్యాభర్తలు, లవర్స్, స్నేహితుల మధ్య అబద్ధాలు అనేవి ఒక చెదపురుగు లాంటివి. చిన్నదైనా, పెద్దదైనా అబద్ధం వల్ల కలిగే పరిణామాలు రిలేషన్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి అబద్ధం చెప్పి దొరికిపోతే ఆ తర్వాత మీరు నిజం చెప్పినా భాగస్వామి నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అబద్ధం చెబుతున్నారేమో? అనే అనుమానం ప్రతి విషయంలోనూ వెంటాడుతుంది. మీ పట్ల రెస్పెక్ట్ తగ్గిపోతుంది. పరస్పర గౌరవం లేని చోట ప్రేమ నిలబడటం కష్టం. కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడంతోపాటు మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. దొరికిపోతానేమో అనే భయంతో ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉంటారు. మోసపోయిన వ్యక్తికి విషయం తెలిసినప్పుడు తీవ్రమైన మానసిక వేదన, డిప్రెషన్ కలిగే అవకాశం ఉంటుంది. అందుకే అబద్ధాలు ఆడకూడదని, ఒకవేళ మనల్ని అబద్ధాలు నిరంతరం మోసం చేయాలని చూస్తున్న వ్యక్తులను ఈ చిట్కాలతో ఈజీగా గుర్తించి దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
పదే పదే అక్కడ తాకడం..
అబద్ధం చెప్పే వ్యక్తులు మన కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేరు. సూటిగా మాట్లాడాలంటే కష్టంగా ఫీల్ అవుతారు. డిస్టెన్స్ మెయింటెన్ చేస్తారు. సాధారణ రోజుల్లో కంటే అబద్ధాలు చెప్పినప్పుడు వారి ముఖంలో నిజాయితీ కనిపించదు. అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేరు. అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. అబద్ధం చెప్పడం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ముక్కును పదే పదే తాకడం, నోరు చేతులతో కప్పుకోవడం, మెడను చేతులతో బంధించడం, కూర్చున్నప్పుడు నిరంతరం కదలడం వంటివి చేస్తుంటారట. అడిగిన విషయం గురించి స్పష్టమైన సమాధానం చెప్పకుండా అతిగా వివరిస్తారు. అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తుంటారు. లేదంటే ఏదో ఒక కొత్త కథ చెప్పేందుకు ప్రయత్నిస్తారు. అబద్ధాలు చెప్పే పార్ట్ నర్ తరచూ ఫోన్ పాస్‌వర్డ్ మార్చేస్తుంటారు. మొబైల్ స్క్రీన్ మీకు ఇతరులకు కనపించకుండా దాచుకుంటారు. సాధారణ కాల్ వచ్చినా దూరంగా వెళ్లి మాట్లాడుతుంటారని ఎక్ట్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఎలా డీల్ చేయాలి?
ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వారితో ప్రశాంతంగా మాట్లాడండి. వారి సందేహాలను పరిష్కరించండి. ఎందుకు అబద్ధం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేదా తక్కువ అయిపోతామనే భయంతో చెబుతున్నారా? అలవాటుగా చెబుతున్నారా? గుర్తించండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మెప్పు పొందాలని చూసేవారిని సున్నితంగా మందలించి రిలేషన్స్ మధ్య విలువను తెలియజేయండి. ఏ బంధమైనా పరస్పర గౌరవం, నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని, ఆ పునాదే లేనప్పుడు బంధాన్ని మోయడం భారంగా ఉంటుందని అర్థం చేయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.






