- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్బ్స్ మెచ్చిన ప్రోమంచ్.!
అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో మంచి డిమాండ్ ఉంది అతడు చేసిన స్నాక్‌కి

దిశ, ఫీచర్స్: అబ్బాయిలు కూడా గరిటె తిప్పడం ఈ రోజుల్లో అనివార్యం. స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోగానే పేరెంట్స్‌కి దూరంగా ఉండటం కామనైపోయింది కాబట్టీ.. వంటా వార్పుతో జర్నీ కూడా కామనైపోయింది. పార్థ్ ముత్తా అనే యువకుడు కూడా ఇలా టైంపాస్ కోసం గరిటె తిప్పి.. ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్ అయ్యాడు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో మంచి డిమాండ్ ఉంది అతడు చేసిన స్నాక్‌కి.
ఎక్స్‌పరిమెంట్స్ వల్లే..
పార్థ్ ముత్తా శాకాహారి. ఇతడు టెన్నిస్ ఆటగాడు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం వెతికేవాడు. అదొక ప్రయాసగా మారింది అతనికి. మామూలుగా అయితే పొటాటో చిప్స్ లేదా పఫ్స్ వంటివి ఎక్కువ తినేవాడు. కానీ అవి ఆరోగ్యానికి మంచివి కావాయె. ఇంకా ఎంత తిన్నా కడుపు నిండిన ఫీలింగే రాకపోయేది. కోవిడ్ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎక్కువ సమయం ఖాళీగా ఉండాల్సి వచ్చేది. అప్పుడు తరుచూ వంటింట్లో దూరేవాడు. ఏదో వచ్చీరాని ఎక్స్‌పరిమెంట్లు చేసేవాడు. వాటిలో కొన్ని ఫెయిలయ్యేవి.. కొన్ని పాసయ్యేవి. ఫెయిలైనా గానీ పార్థ్ తన ప్రయోగాలు ఆపకపోయేది.
ప్రోమంచ్ స్నాక్స్..
రెసిపీలతో ప్రయోగాలు చేస్తూ చేస్తూ మొత్తానికి ఒక ఐటమ్ కనిపెట్టాడు. అదే ''ప్రోమంచ్''. ఇది సోయాబీన్ ఆధారిత క్రంచీ బాల్స్ స్నాక్. నూడుల్ మసాలా.. పెరి పెరి వంటి ఇండియన్ ఫ్లేవర్ టేస్ట్ ఉంటాయి ఇవి. ఈ కాంబో ప్యాక్‌లు సుమారు 17 డాలర్లకు అందుబాటులో ఉన్నాయి. పార్థ్.. బోస్టన్ యూనివర్సిటీలో గ్లోబల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. ఒకవైపు చదువుతూనే మరోవైపు అమెజాన్‌లో వీటిని అమ్ముతున్నాడు. అమెజాన్లో ప్రోడక్ట్ లిస్ట్ చేసిన మొదటి బీయూ విద్యార్థి ఇతడే కావడం విశేషం. వంటగదిలో మొదలైన ఈ ప్రయాణం అమెజాన్ వరకు వెళ్లడం నిజంగా అద్భుతం.
వారసత్వ రెసిపీ..
పార్థ్ ఆలోచన కుటుంబ సభ్యులకు కూడా చాలా నచ్చింది. అందుకే వాళ్లు అన్ని విధాలుగా సహకరించారు. ముఖ్యంగా వాళ్ల అమ్మమ్మ సంతోషం మామూలుగా లేదు. ఎందుకంటే తన హస్బెండ్ కూడా సేమ్ ఇలాంటి స్నాక్‌నే యంగేజ్‌లో కనిపెట్టాడంట. ఇదే విషయం మనవడితో చెప్తే అతడు ఎగిరి గంతేశాడు. అంటే రెసిపీ తయారీ అనేది వాళ్ల ఫ్యామిలీలో వారసత్వంగా వస్తుందన్నమాట. ఇదే స్ఫూర్తితో 2021లో ఇన్-పర్సన్ సేల్స్ మొదలుపెట్టాడు. తర్వాత ఆన్‌లైన్ సేల్స్‌కు మారాడు. బోస్టన్ యూనివర్సిటీలోని బీయూఐల్డ్ ల్యాబ్ ఐడీజీ క్యాపిటల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ సెంటర్ ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది.
అమెజాన్ ఛాయిస్..
బోస్టన్ యూనివర్సిటీ డైరెక్టర్ జెన్ మిగ్లియోర్ సలహాలు.. క్వెస్ట్రమ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లోని ఐడీఏ కాన్ఫెరెన్స్ తర్వాత పార్థ్ బిజినెస్‌ను విస్తరించాడు. బీయూఐల్డ్ ల్యాబ్ ఇన్నోవేషన్ పాథ్‌వే ప్రోగ్రామ్‌లో చేరి తన ఉత్పత్తిని స్కేల్ చేయడంపై దృష్టి పెట్టాడు పార్థ్. ప్రోమంచ్ బ్రాండ్ వృద్ధికి రివ్యూలు.. ఈవెంట్లు.. సోషల్ మీడియా మార్కెటింగ్.. వెబ్‌సైట్ సేల్స్ ఎంతో సహాయపడ్డాయి. ప్రస్తుతం ప్రోమంచ్ టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఇంకా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. క్యాంపస్ అంబాసిడర్ల సహకారం ఉంది. ఇటీవల ''అమెజాన్ ఛాయిస్''గా గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్.. జియోమార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉంది.
ఫోర్బ్స్ జాబితాలో..
2025లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా లిస్ట్‌లో పార్థ్ ముత్తా చోటు దక్కించుకున్నాడు. 'ది ఆర్ట్స్' కేటగిరీలో ఎంపికైన అతను ఇండియన్ శాకాహారులలో ప్రోటీన్ లోపాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రోమంచ్‌ను ప్రారంభించినట్లు ఫోర్బ్స్ గుర్తించింది. ఇండియా నుంచి 94 మంది ఎంపిక కాగా.. పార్థ్ వంటి యువ ఎంట్రప్రెన్యూర్లు ముందంజలో ఉన్నారు. 2025 సెప్టెంబర్లో బ్యాంకాక్‌లో జరిగిన ఫోర్బ్స్ అండర్ 30 సమ్మిట్ ఆసియాలో పార్థ్ పాల్గొన్నాడు. అంతేగాక ప్రోమంచ్ ప్రొడక్ట్స్ 'డిస్కవరీ ఏరియా'లో ప్రదర్శితమయ్యాయి. యువ ఇన్నోవేటర్ల డిస్కషన్లలో భవిష్యత్ కార్యచరణపై చర్చించాడు పార్థ్.






