Viral : లవ్ స్టోరీలు రాసే నగరం..! పారిస్‌లో ప్రపోజ్ చేస్తే 99% ‘యెస్’ గ్యారెంటీ..!!

by Javid Pasha |   (  Updated:2025-10-31 13:26:14  IST  )

పారిస్‌లోని అందమైన ఎఫిల్ టవర్, మెరిసే లైట్లు, ప్రశాంతంగా ప్రవహించే సీన్ నది సృష్టించే వాతావరణం ప్రేమను ప్రేరేపించే భావోద్వేగాa మాయా జాలంగా పనిచేస్తుంది.

Viral : లవ్ స్టోరీలు రాసే నగరం..! పారిస్‌లో ప్రపోజ్ చేస్తే 99% ‘యెస్’ గ్యారెంటీ..!!
X

దిశ, ఫీచర్స్ : పారిస్.. ఈ పేరు వినగానే ఔత్సాహికులకు గుర్తొచ్చే మరో విషయం ఏంటంటే.. అదొక అందమైన నగరమే కాదు, అందరూ మెచ్చే రొమాంటికల్ డెస్టినేషన్ కూడా. అందుకే కొందరు తాము లవ్ ప్రపోజ్ చేయాల్సిన భాగస్వామికి పారిస్‌లో చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అక్కడి.. మనసును దోచే ఆహ్లాదకరమైన వాతావరణమే ఇందుకు కారణం. పారిస్‌లోని కొన్ని అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ లవ్ ప్రపోజ్(Love proposal) చేస్తే.. అవతలి వ్యక్తి దాదాపు కాదనే అవకాశం ఉండదని, 99% అవుననే అంటారనే సెంటిమెంట్‌ను పలువురు నమ్ముతుంటారు. అందుకే పారిస్ అంటేనే లవ్ అండ్ రొమాంటికల్ డెస్టినేషన్‌(Romantic destination)గా స్థిరపడిపోయింది.

పారిస్‌(Paris)లోని అందమైన ఎఫిల్ టవర్(Eiffel Tower), మెరిసే లైట్లు, ప్రశాంతంగా ప్రవహించే సీన్ నది(Seine River) సృష్టించే వాతావరణం అక్కడికి వెళ్లిన వ్యక్తుల్లో, జంటల్లో ప్రేమను ప్రేరేపించే భావోద్వేగాల మాయా జాలంగా పనిచేస్తాయని, ప్రేమను అంగీకరించే అనివార్యతను సృష్టిస్తాయని చెప్తారు. అంతేకాకుండా మనోహరమైన(cuteness) ఫ్రెంచ్ వీధులు, తాజా క్రోయిసాంట్ల(croissants) వాసన, వీధుల్లో వినిపించే మృదువైన సంగీత ధ్వనులు, ప్రతీ క్షణాన్ని సినిమాటిక్ ప్రపోజల్‌గా మారుస్తాయి. కాబట్టి పారిస్ కేవలం ప్రేమ కథలకు సాక్షి మాత్రమే కాదు, అది ప్రేమ కథలను రాస్తుందని కూడా అంటారు. ఈ నగరం రొమాన్స్‌ను శాస్త్రీయంగా కూడా బలపరుస్తుంది. ప్రేమికులకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తుంది. Link

Next Story