ఆత్మీయ స్పర్శ.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతున్నపేరంటల్ హగ్!

by Javid Pasha |

తల్లిదండ్రుల కౌగిలింత పిల్లల మెదడు ఎదుగుదలలోనూ కీ రోల్ పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆత్మీయ స్పర్శ.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతున్నపేరంటల్ హగ్!
X

దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు కేవలం ఆనందాన్నే కాదు.. వారికి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల కౌగిలింత వారి మెదడు ఎదుగుదలలోనూ కీ రోల్ పోషిస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థలను ఆకృతి చేసే జీవ సంబంధమైన భద్రతా సంకేతాలను అందించడంలోనూ ఇది సహాయపడుతుందని PubMed జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం తెలిపింది. బాల్యంలో తరచుగా ప్రేమ పూర్వకమైన స్పర్శ లభించిన పిల్లలు ఆత్మ విశ్వాసం గలిగిన వారిగా, మెరుగైన రోగ నిరోధక శక్తి కలిగిన వారిగా ఎదుగుతారని పేర్కొన్నది. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భావోద్వేగ నియంత్రణ

బాల్యంలో తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ లేదా కౌగిలింత చిన్న పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమతో హగ్ చేసుకోవడమనేది పిల్లల్లో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కలిగించడం వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాకుండా తక్కువ ఒత్తిడిని దూరం చేయడంలో, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అభివృద్ధిలో, మెరుగైన భావోద్వేగ నియంత్రణలో తల్లిదండ్రుల స్పర్శ కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు పిల్లల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది స్ట్రెస్ రియాక్షన్‌ను శాంతపరుస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తాము చాలా సురక్షితంగా ఉన్నామనే భావనను పిల్లల్లో కలిగిస్తుంది. ఈ విధమైన భావనే పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ వేగంగా, సక్రమంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుంది అంటున్నారు నిపుణులు.

సురక్షిత భావనను పెంచుతుంది

బాల్యంలో తల్లిదండ్రులకు దూరంగా పెరిగే పిల్లలతో పోలిస్తే.. అమ్మా నాన్నల సమక్షంలో, ప్రేమగల కుటుంబంలో పెరిగే పిల్లలు ఎక్కువ యాక్టివ్‌గా, ధైర్యంగా, ఆత్మ విశ్వాసంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఏవైనా జబ్బుల బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటారు. ఇక్కడ అమ్మ లేదా నాన్న కౌగిలి పిల్లలకు మరింత ఎక్కువ ఓదార్పునిస్తుంది. పేరెంట్స్ ఆత్మీయ స్పర్శతో రియాక్ట్ అయిన నాడీ వ్యవస్థ, ‘మీరు అత్యంత సేఫ్‌ జోన్‌లో ఉన్నార’నే సంకేతాలను పిల్లల మెదడుకు పంపి, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల విషయంలోనే కాదు పెద్దల్లోనూ ప్రేమ పూర్వకమైన సంబంధాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

Next Story