- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: అప్పట్లో బంగ్లాదేశ్.. ఇప్పుడు బెలూచిస్తాన్.. పాకిస్థాన్ రెండో సారి ముక్కలు అవడం తథ్యమా..? భారత్ ప్లాన్ ఏంటి..?
Pakistan: భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Pakistan: భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాప్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన తీవ్రమైన దాడిలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. దీనిపైన పెద్ద ఎత్తున భారత్ వైపు నుంచి పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పించేందుకు యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాకిస్తాన్ చివరిసారిగా ముఖాముఖి 1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా తలపడ్డాయి. అప్పట్లో భారత్ సైన్యాలు పాకిస్తాన్ మూకలను అవతలి వరకు తరిమికొట్టాయి.
అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ నాలుగు సార్లు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన ప్రతిసారి భారత్ పై చేయి సాధించింది. అయితే 1971లో జరిగిన యుద్ధం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆ యుద్ధంలో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే సరికొత్త దేశాన్ని భారత్ ఏర్పాటు చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విముక్తిని తక్షణ కర్తవ్యం గా భావించి, పాకిస్తాన్ ను మట్టికరిపించి బంగ్లాదేశ్ ఏర్పాటు వెనుక కీలకంగా పావులు కలిపారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పాయి.. పార్లమెంటులో అపర కాళికా దేవిగా అభివర్ణించారు. ఇలా పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ భారత యుద్ధం చేస్తే మరో రెండు ముక్కలుగా విడిపోవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
పాకిస్థాన్లో సుదీర్ఘకాలంగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశం డిమాండ్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఈ డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 30 శాతం పైన ఉన్న బలూచిస్తాన్ స్వత్రంత్ర దేశ డిమాండ్ కోసం బలూచ్ నేషనలిస్ట్ మూవ్మెంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (BRA).బలంగా పనిచేస్తున్నాయి. భారత్ కనుక బలూచిస్థాన్ ఉద్యమానికి మద్దతు తెలిపితే చాలు, పాకిస్తాన్ మరో ముక్క అవడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే భారత గూడచారి విభాగం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ బలూచిస్తాన్ వేర్పాటు వాదులతో కలిసి పనిచేస్తుందని, సమాచారం అందుతోంది.
దీనికి తోడు ఇజ్రాయెల్ గుఢాచారి సంస్థ మొస్సాద్ కూడా చేయి కలిపినట్లయితే ఇక పాకిస్తాన్ ముక్కలు కావడం పెద్ద కష్టమేమీ కాదని అంతర్జాతీయ రాజకీయాల పైన అనుభవం ఉన్న విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ యుద్ధంలో వారం రోజుల కన్నా ఎక్కువగా నిలవలేదని ఆ దేశ త్రివిధ దళాధిపతులే దేశ సర్వ సైన్యాధ్యక్షుడుకి తెలిపినట్లు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే బలూచిస్థాన్ ఏర్పాటు అనేది వ్యూహాత్మకంగా భారత్ కు చాలా కీలకం అవుతుందని చెప్పవచ్చు. ఖనిజ వనరులు, గ్యాస్, సహజ సంపద బలూచిస్థాన్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇరాన్ తో భూభాగం పంచుకోవడంతో పాటు...ఇక్కడ అత్యంత కీలకమైన గ్వాదర్ సీపోర్ట్ కూడా బలూచిస్తాన్ లోనే ఉంది. కనుక బలూచిస్తాన్ కనుక ప్రత్యేక దేశంగా మారినట్లయితే, కచ్చితంగా భారత్ కు అత్యంత లాభదాయకంగా మారుతుందని, ఇక పాకిస్తాన్ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.






