Love hormone : మనిషి గుండెను బతికిస్తున్న లవ్ హార్మోన్..! ఏ విధంగా అంటే..

by Javid Pasha |

Love hormone : మనిషి గుండెను బతికిస్తున్న లవ్ హార్మోన్..! ఏ విధంగా అంటే..

Love hormone : మనిషి గుండెను బతికిస్తున్న లవ్ హార్మోన్..! ఏ విధంగా అంటే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే శారీరక విధుల్లో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో ఆక్సిటోసిన్ (Oxytocin) కూడా ఒకటి. దీనిని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సామాజిక సంబంధం, ప్రేమ, విశ్వాసం, సాన్నిహిత్యంతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రవర్తనలను ప్రోత్సహించడం ద్వారా సంతోషకరమైన జీవితానికి కారణం అవుతుంది. అయితే ఇది మనిషి గుండెను బతికించడంలోనూ కీ రోల్ పోషిస్తుందనే విషయం మీకు తెలుసా? తాజా అధ్యయనం అదే వెల్లడించింది.

జీబ్రాఫిష్ (zebrafish) అండ్ మానవ కణాల పనితీరు(human cell cultures)పై మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశోధన లవ్ హార్మోన్ ప్రభావం గురించి పలు కొత్త విషయాలను వెల్లడించింది. ఏంటంటే.. ఆక్సిటోసిన్ ఎపికార్డియం - డిరైవ్డ్ ప్రోజనిటర్ సెల్స్ (EpiPCs)ని యాక్టివేట్ చేస్తుందని తేలింది. ఈ EpiPCs కార్డియోమయోసైట్స్‌గా, అంటే గుండె కొట్టుకోవడానికి అవసరమైన, గుండె కండర కణాలుగా మారతాయి. దీనివల్ల గుండె గాయం తర్వాత కణజాల రీ జనరేషన్‌ను కూడా ప్రేరేపిస్తాయి. కాబట్టి మనిషి గుండెను బతికించడంలో లవ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండె గాయాల చికిత్సలోనూ ఆక్సిటోసిన్ హెల్ప్ అవుతుందని రీసెర్చర్స్ అంటున్నారు. ఎందుకంటే ఇది మూల కణాలను ప్రేరేపించడం ద్వారా గుండె మరమ్మత్తును వేగవంతం చేయడంలో సహజంగానే సహాయపడుతుంది.

Link

Next Story