- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
stress : సామాజిక జీవితంపై ఒత్తిడి ప్రభావం.. ఒబేసిటీకి అదే కారణం!

దిశ, ఫీచర్స్ : మానసిక ఒత్తిడి పరోక్షంగా పలు రకాల శారీరక అనారోగ్యాలకు కూడా దారితీస్తుందని తెలిసిందే. అయితే ప్రస్తుతం అది ఒబేసిటీ లేదా ఊబకాయం సమస్యకు కూడా కారణం అవుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.‘న్యూట్రీసిస్టమ్’ సర్వే ప్రకారం.. 30 ఏండ్లు పైబడిన 2000 మందిని నిపుణులు పరిశీలించగా.. ఐదేండ్లక్రితంతో పోలిస్తే ప్రస్తుతం 57 శాతం మంది ప్రజలు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో 47 శాతానికిపైగా తాము మెంటల్ స్ట్రెస్ కారణంగానే అధిక బరువు పెరుగుతున్నామని భావిస్తున్నారు.
ఒత్తిడి ఎదుర్కోవడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషించగా.. ప్రతీ 10 మందిలో నలుగురు ఇనాక్టివ్ సిట్టింగ్, అతి ఆలోచనల కారణంగా స్ట్రెస్‌కు గురవుతున్నారు. మరో 30 శాతం మంది భోజనం సరిగ్గా ఉండకపోవడం లేదా పోషకాలు లోపించడం కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. కాగా ఆయా సందర్భాల్లో పలువురు ఎదుర్కొంటున్న స్ట్రెస్ వారి సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. 44 శాతం మందిలో వర్క్ అండ్ లైఫ్‌పై ప్రభావం చూపుతోంది. డబ్బు సంపాదించే క్రమంలో 36 శాతం మంది, అలాగే ఉద్యోగం చేసేచోట 34 శాతం మంది తరచుగా స్ట్రెస్‌కు గురవుతున్నారు.
కాగా స్ట్రెస్ వల్ల బరువు పెరుగుతున్నామని భావిస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరు నిరంతరం ఆందోళన చెందుతున్నారు. 46 శాతం మంది ఒత్తిడి కారణంగా నిద్రను, 37 శాతం మంది ఏకాగ్రతను కోల్పోతున్నారు. 30 శాతం మందిలో ప్రెజర్ పెరుగుతుండగా, ప్రతీ 10 మందిలో నలుగురు క్రానిక్ స్ట్రెస్‌ను అనుభవిస్తున్నారు. దీంతోపాటు ఒత్తిడివల్ల చాలా మంది సాధారణంకంటే 5 నుంచి 7 కిలలో బరువు పెరుగుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పులు, హెల్తీ ఫుడ్ హాబిట్స్, వ్యాయామాలు వంటివి అందుకు సహాయపడతాయి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






