- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి ఆలోచనలతో అనారోగ్యం.. బయటపడే చిట్కాలివిగో..!
అతిగా ఆలోచించే అలవాటు మీలో రక్తపోటును పెంచుతుంది. దీర్ఘకాలికంగా కొనసాగితే గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీయవచ్చు!

దిశ, ఫీచర్స్ : ఆలోచనలు అందరికీ ఉంటాయి. కానీ అతి ఆలోచనలే నష్టం చేస్తాయి అంటున్నారు మానసిక నిపుణులు. నిజానికి టెన్షన్ లేని జీవితం ఉండదు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత టెన్షన్ పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగనీ ప్రతీ విషయానికి టెన్షన్ పడట మాత్రం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే అయిన దానికి, కాని దానికి ఓవర్‌గా ఆలోచించి మనసుక పాడు చేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. నిపుణులు సైతం ఇదే సలహా ఇస్తున్నారు. అతి ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, వాటిని దూరం చేసుకకపోతే నష్టపోతారని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం పదండి.
*సాధారణంగా అతి భావోద్వేగానికి గురయ్యే వ్యక్తులు అతిగా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ప్రతీ విషయాన్ని మనసులో పెట్టుకుని, ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచిస్తూనే ఉంటారు. దీని వల్ల వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు. అంతేకాదు అతిగా ఆలోచించే అలవాటు మీ రక్తపోటును బాగా పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీయవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇక కొందరైతే అతిగా ఆలోచించడంకోసం సిగరెట్లను కాల్చడం, ఆల్కహాల్ తాగడం చేస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. అందుకే ఇలాంటి హాబీస్ అన్నింటినీ వదులుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయండి..!
*మీరు ఓవర్ థింకర్ అయితే గనుక దానినుంచి బయట పడటం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని టెక్నిక్స్ పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఖాళీగా ఉంటే.. ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. లేని పోని విషయాలు గుర్తొస్తాయి. అందుకే మిమ్మల్ని బాధించే విషయం గురించి ఆలోచించకుండా ఉండాలంటే.. మీరు ఖాళీగా ఉండకండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీకు సంతోషం కలిగించే పనుల్లో నిమగ్నమైతే అతి ఆలోచనలు దూరం అవుతాయి.
*నెగెటివ్ ఆలోచనలు ఎక్కువైనా నష్టమే. అందుకే పనిగట్టుకొని మీలో నెగిటివ్ ఆలోచనలను పుట్టించే వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు నిపుణులు. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెడితే.. మీరు కూడా అతనితో ఆ విధంగానే మాట్లాడండి. అలాగే వ్యవహరించండి. ఒకవేళ అలా మాట్లాడేందుకు మీ మనస్సు ఒప్పుకోకపోతే వారితో మీకున్న సంబంధాన్ని కట్ చేసుకోవడమే ఉత్తమం.
*సంతోషం ఎక్కడో బజార్లో దొరికేది కాదు. పాజిటివ్ ఆలోచనలు కూడా దాదాపు అంతే.. వాటిని మీరు అలవాటు చేసుకోవాలి. అప్పుడే నెగెటివిటీ తగ్గుతుంది అంటారు నిపుణులు. అందుకే తరచుగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే ఇందుకోసం యోగా, మెడిటేషన్ చేయండి వంటివి చేయండి. ప్రకృతిలో గడుపుతూ పరిసరాలను ఆస్వాదిస్తూ ఉండండి. నచ్చిన పుస్తకాలు చదవండి. నచ్చిన వ్యక్తులతో సంభాషించడం, నచ్చిన వాతావరణంలో ఉండటం కూడా పాజిటివిటీని పెంచుతుంది. ప్రతికూల ఆలోచనలు, అతి ఆలోచనలు తగ్గడానికి ఇవన్నీ తోడ్పడతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






