- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : ఓ వైపు మోడ్రన్ టెక్నాజీతో ఎంతో మేలు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అందుబాటులోకి వచ్చాక అనేక విషయాల్లో మానవులకు హెల్ప్ అవుతోంది. ఆయా రంగాల్లో సేవలను సులభతరం చేయడంలో, సౌకర్యాలు కల్పించడంలో కీ రోల్ పోషిస్తోంది. ఇదంతా పాజిటివ్ కోణం మాత్రమే. అయితే దీనిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే సమస్యలు, నష్టాలు సైతం తలెత్తే చాన్స్ ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు. ప్రధానంగా ఏఐ టూల్స్‌పై అతిగా ఆధారపడటం మానువుల్లో కాగ్నిటివ్ లేజీనెస్(Cognitive Laziness)కు దారితీసే ప్రమాదం ఉందని, ఇప్పటికే కొందరు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రతీ విషయంలో సొంతంలో ఆలోచించకుండా ఏఐని అడగడం, దానిపైనే పూర్తిగా ఆధారపడటం, వివిధ టూల్స్‌ను తమ అవసరాలకు ఉపయోగించుకోవడం ఇటీవల పెరుగుతోంది. అయితే ఇది స్వతంత్ర ఆలోచనా శక్తిని, మెదడు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లప్పుడూ ఏఐ నుంచి సమాధానాలు, సూచనలు, సలహాలు తీసుకుంటూ పోతే మెదడు స్వయంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నాన్ని మానేస్తుంది. దీనినే ‘కాగ్నిటివ్ లేజీనెస్(Cognitive Laziness) అంటారు. అంటే మైండ్ మొద్దుబారిపోతుంది. ఏఐ టూల్స్ అధిక వినియోగంవల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత వంటివి క్రమంగా తగ్గిపోతాయి.
చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు ఇటీవల అనేకమంది AIని అడిగేస్తు్న్నారు. దీంతో మెదడు కష్టపడి ఆలోచించే అవకాశాన్ని కోల్పోతోంది. ఉదాహరణకు.. ఒకప్పుడు ఏదైనా రూట్ తెలియకపోతే మ్యాప్ చూసుకుని లేదా ఎవరినైనా అడిగేందుకు మెదడుని ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు Google Maps లేదా AI చెప్పినట్టు నడుస్తుున్నారు. అలాగే రాయడంలో, లెక్కలు వేయడంలో, సమాచారం గుర్తుపెట్టుకోవడంలో కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు కొందరు. ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ AIని అడిగితే చేసేస్తుంది కాబట్టి. కానీ నిజానికి ఏఐ టూల్స్ అధిక వినియోగం మీ సొంత నైపుణ్యాలను దెబ్బతీస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అందుకే మెదడు మొద్దుబారేంతలా ఉపయోగించవచ్చు. మానవ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానికి మధ్య బ్యాలెన్స్ పాటించాలి. సొంతంగా ఆలోచించడం, మెదడును ఉపయోగించడంపైనే ఎక్కువ ఫోకస్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో, తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఏఐ టూల్స్ ఉపయోగిస్తే అప్పుడు దీనివల్ల ఎటువంటి రిస్క్ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.






