Health : ఓవర్ ఈటింగ్ డిజార్డర్.. బయటపడే మార్గమిదిగో!

by Javid Pasha |

Health : ఓవర్ ఈటింగ్ డిజార్డర్.. బయటపడే మార్గమిదిగో!

Health : ఓవర్ ఈటింగ్ డిజార్డర్.. బయటపడే మార్గమిదిగో!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల యువతలో, పెద్దల్లో కూడా తినే రుగ్మతలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి కొన్ని సీజన్లలో మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చిపోతే.. సీజనల్ ఓవర్ ఈటింగ్ డిజార్డర్‌గా పేర్కొంటారు. చలికాలంలోనూ అనేక మందిని వేధిస్తుంది. మానసిక ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, గంటల తరబడి స్క్రీన్లముందు కూర్చోవడం వంటివి ఈ రుగ్మతకు కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తినడానికి చిన్నప్లేట్ వాడండి

సాధారణంకంటే ఎక్కువగా తినడం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు ‘ఓవర్ ఈటింగ్ డిజార్డర్’గా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆహార పదార్థాలు కనిపిస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. కొద్దిగానే తినేద్దామనుకొని ప్రారంభిస్తారు కానీ.. ఆ సంగతే మర్చిపోయి అతిగా లాగించేస్తుంటారు. కాబట్టి ఈ రుగ్మత ఉన్నవారు అన్నం, ఇతర పదార్థాలు తినేందుకు చిన్న ప్లేట్ వాడటం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తక్కువ ఆహారం పడుతుంది. దీంతో రెండవసారి వడ్డించుకునేందుకు గ్యాప్ దొరుకుతుంది. మళ్లీ వడ్డించుకోవాలనుకునే సరికి తక్కువగా తినాలి కదా.. అనే విషయం గుర్తుకు వస్తుంది. కాబట్టి అంతటితో ఆపేస్తారు. అదే పెద్ద ప్లేట్ అయితే ఒకేసారి ఎక్కువ ఆహారం వడ్డించుకుంటారు. రెండవసారి కూడా అదే జరుగుతుంది.

స్లోగా తింటూ.. వాటర్ తాగుతూ..

త్వరగా తినవడంవల్ల కూడా కొందరు ఆత్రుతలో ఎక్కువగా లాగించేస్తుంటారు. అలా జరగకూడదంటే.. స్లోగా తినాలంటున్నారు నిపుణులు. మెల్లిగా తింటూ.. ఆహారాన్ని బాగా నములుతూ రుచిని ఆస్వాదించాలి. దీంతో ఎక్కువసేపు తిన్న ఫీల్ కలుగుతుంది. అలాగే ఆహారం మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉంటే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అప్పుడు తక్కువగా తింటారు.

స్క్రీన్లు చూస్తూ తినవద్దు

తినే సమయంలో ఫోన్లు, టీవీలు వంటి స్ర్కీన్లు చూడటంవల్ల ఫోకస్ అంతా దానిపై పడి ఎక్కువగా తినేస్తుంటారు. కొన్నిసార్లు తాము ఎంత తింటున్నామనేది కూడా పట్టించుకోరు. కాబట్టి ఆహారం తినేముందు స్ర్కీన్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కాయ ధాన్యాలు, క్యారెట్, ఓట్స్, ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే తినే రుగ్మతను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story