- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్.. బుద్ధున్నోడెవడైనా ఈ సమయంలో యుద్ధం చేస్తాడా.. నా అన్వేషణ వీడియో..
ఆపరేషన్ సిందూర్ మొదలైంది. ఇప్పటికే 90 మంది ఉగ్రవాతులు హతమయ్యారు. భారత్ పని ప్రారంభించింది కానీ పాక్ ఇంకా షాక్‌లోనే ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు నిమిషానికి వేలలో అప్‌లోడ్ అవుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్ మొదలైంది. ఇప్పటికే 90 మంది ఉగ్రవాతులు హతమయ్యారు. భారత్ పని ప్రారంభించింది కానీ పాక్ ఇంకా షాక్‌లోనే ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు నిమిషానికి వేలలో అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో భారత్ యుద్ధం జరుగుతుందా? అనే విషయంపై ఈ మధ్య విశ్లేషణ ఇచ్చిన నా అన్వేషణ యూట్యూబర్‌పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ అరకొర నాలెడ్జ్‌తో ఇప్పటికైనా విశ్లేషణలు ఆపితే బెటర్ అని సూచిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ‘‘భారత్‌తో పాక్ యుద్ధం’’ టాపిక్‌పై వారం, పది రోజుల ముందు నుంచే ఛానల్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయన్సర్స్ నంబర్ ఆఫ్ వీడియోస్ చేశారు. దీనిపై సెటైర్ వేస్తూ ఓ విశ్లేషణతో ముందుకొచ్చాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఇదంతా డబ్బులు సంపాదించే టెక్నిక్ అని విమర్శించాడు. ఆర్థికంగా భారతదేశం ఎదుగుతుందని, బుద్ధున్నోడెవడైనాఈ సమయంలో యుద్ధం చేస్తాడా అని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి ఎటాక్ చేశారంటే అది మన తప్పేనని.. తాము బాగుపడకపోయినా పర్వాలేదు శత్రుదేశం నాశనం కావాలని పాక్ ఎప్పటి నుంచో చూస్తుందని.. అలాంటప్పుడు మనమే జాగ్రత్త పడాల్సిందన్నాడు. ఇక పాక్‌కు అసలైన శత్రువు ఆప్ఘనిస్తాన్ అని.. యుద్ధం జరిగితే ఆ రెండు దేశాల మధ్య జరుగుతుందన్నాడు.
ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఎటాక్ విషయంలో ఇండియన్ ఆర్మీని బ్లేమ్ చేయడమేంటి? ఇన్ని దేశాలు తిరిగిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా అంటా.. పెద్ద అనాలసిసే కానీ ఇక మానుకో.. సొల్లు చెప్పమంటే మస్త్ జెప్తరులే’’ అని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటోళ్లను ఏమనాలంటూ ఇంకొందరు కామెంట్ చేస్తుంటే... మొత్తానికి కామెడీ పీస్ అయిపోయాడని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation
- Naaanveshana
- war
- Pak-India War
- viral video






