- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Opal Suchata Chuang Sri : ట్రెండింగ్‌లో అందాల భామ ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ.. ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే..!
Opal Suchata Chuang Sri : ట్రెండింగ్‌లో అందాల భామ ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ.. ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే..!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఏ నోట విన్నా ఎక్కువగా నిపిస్తున్న పేరు ఒక్కటే. అదే మిస్ థాయ్‌లాండ్ ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ(Opal Suchata Chuang Sri). హైదరాబాద్ హైటెక్స్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్‌గా నిర్వహించిన 72వ మిస్ వలర్డ్ పోటీలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో వివిధ దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొనగా, ఫైనల్లీ తన అందం, అభినయం, ప్రతిభతో ‘మిస్ వరల్డ్ 2025’ ప్రపంచ సుందరి కిరీటాన్ని ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలో వరల్డ్‌వైడ్‌గా ఆమె చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
*మిస్ వరల్డ్ - 2025 విజేత ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ(Winner Opal Suchata Chuang Sri) థాయ్ లాండ్‌లోని ఫుకెట్‌లో పుట్టి పెరిగింది. విద్యాభ్యాసం విషయానికి వస్తే బ్యాంకాక్‌లోని త్రియం ఉదోమ్ సుక్సా స్కూల్‌లో చదువుకున్న ఈ 21 ఏండ్ల యువతి.. అప్పట్లోనే అద్భుతమైన ప్రతిభను కనబరిచేది. చదువుకుంటున్న సమయంలోనే థాయ్, ఇంగ్లీష్‌తో పాటు చైనీస్ భాషలో ప్రావీణ్యం సంపాదించింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న సుచాత వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపేది. ఇదే ఆమెను అందాలపోటీ వైపు అడుగులు వేసేలా ప్రేరేపించిందని చెబుతుంటారు.
*ప్రజెంట్ థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీది వ్యాపార వేత్తల కుటుంబ నేపథ్యం కావడం ఆమెకు మరో ప్లస్‌పాయింట్ అయింది. దీంతో అంతర్జాతీయ విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మోడలింగ్, అందాల పోటీలు(Beauty contests) వంటి విషయాల్లో కేంద్రీకరించడం మొదలు పెట్టింది. ఈ విధమైన మక్కువతోనే ఆమె 2021లో మిస్ రట్టానాకోసిన్(Miss Rattanakosin) పోటీల ఆడిషన్స్‌లో పాల్గొన్నది. కానీ మొదటి ప్రయత్నంలో విఫలమైంది. అయినా ఆమె ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. తన రెండవసారి ప్రయత్నాన్ని ఆపలేదు.
*2022లో.. అంటే అప్పుడు ఒపాల్ సుచాత వయసు 18 సంవత్సరాలు. ఈ సందర్భంలో ఆమె మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్’ పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా సక్సెస్ సాధించింది. దీంతో ఆమెలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే ధైర్యంతో 2024లో కూడా ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్’ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఇక్కడ తన సొంత టాలెంట్‌తో విజేతగా నిలిచిన ఓపల్ సుచాత ‘మిస్ ఛార్మింగ్ టాలెంట్’, ‘మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్’ సైబ్ టైటిల్స్ సొంతం చేసుకొని మరింత ఫేమస్ అయింది.
*మరో విషయం ఏమిటంటే ఒపాల్ సుచాతకు తన 16 ఏండ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఆమె జీవితంలో ఒక బాధాకరమైన విషయమే అయినప్పటికీ ధైర్యంగా, ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటూ దానిని ఎదుర్కొన్నది. ఆ తర్వాత ఒపాల్ ఫర్ హర్ (Opal for Her) ప్రాజెక్టును ప్రారంభించి క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చింది. ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆమె ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. సొంత టాలెంట్‌తో, ఫ్యామిలీ సపోర్ట్‌తో వాటన్నింటినీ అధిగమించిన ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ (Winner Opal Suchata Chuang Sri) చివరికి ప్రస్తుత మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలిచి, అందాల పోటీ విజేతగా నిలిచి ప్రపంచాన్ని ఆకట్టుకున్నది.






