- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనానికి వెళ్లి తన తాళాలు మర్చిపోయిన దొంగ.. చివరికి ఏమైంది?! (వీడియో)
తాళాలు మర్చిపోయిన ఈ దొంగ కంగారును మీరూ చూడండి! Thief Forgets His Keys Inside Crime Scene.

దిశ, వెబ్‌డెస్క్ః దొంగ తననానికి వెళ్లిన దొంగ ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క క్షణంలో ఏదైనా కావచ్చు. అయితే, ఉత్తర కాలిఫోర్నియాలో ఒక దొంగ, డోనట్ కంపెనీ కార్పొరేట్ ఆఫీసులో దొంగతనానికి వెళ్లి, అక్కడ తన తాళాన్నే మర్చిపోయాడు. దొంగతనం చేసి, వెళ్లిపోయిన కొంత సేపటికి మళ్లీ నేరం జరిగిన ప్రదేశానికి తిరిగొచ్చాడు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, శనివారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని జానీ డోనట్స్ కార్యాలయంలో ఇతడు కొంత నగదును అపహరించాడు. అయితే, తాళాలు మర్చిపోయి, తిరిగి అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ అమర్చిన కెమెరాలకు చిక్కాడు. మరో ట్విస్ట్‌లో, అతడు సదరు బేకరీకి చెందిన వాహనం తాళాలను పుచ్చుకొని, బయటకి వెళ్లాడు. అయితే, ఆ వాహనాన్ని దొంగిలించక పోవడం విశేషం. సోమవారం జరిగిన ఈ నేరంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక ఈ దొంగతనంపై లెఫ్టినెంట్ డాన్ ఫింక్ విచారణ చేస్తున్నారు. రాత్రి 10 గంటలకు చోటుచేసుకున్న ఈ దొంగతనంలో నిందితుణ్ని గుర్తించడానికి శాన్ రాఫెల్ పోలీసులు ప్రజల సహాయాన్ని కోరుతున్నారు. తాళాలు మర్చిపోయిన ఈ దొంగ కంగారును మీరూ చూడండి!






