- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. పొట్టిదాని ఎక్స్‌ప్రెషన్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో.. ఇలాంటి వీడియోల కోసం ఇంటర్నెట్ బిల్లు ఎన్ని లక్షలు కట్టినా పర్లేదు..
ఇంటర్నెట్‌లో రోజుకు కొన్ని లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే క్యూట్‌నెస్‌తో నెట్టింట వైరల్‌గా మారుతాయి. ఇలాంటి వీడియోనే ఈ పొట్టి పాప క్లిపింగ్. అమాయకపు చూపులు,

దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్‌లో రోజుకు కొన్ని లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే క్యూట్‌నెస్‌తో నెట్టింట వైరల్‌గా మారుతాయి. ఇలాంటి వీడియోనే ఈ పొట్టి పాప క్లిపింగ్. అమాయకపు చూపులు, బ్లూ అండ్ వైట్ డ్రెస్, రెడ్ బో, క్యాప్ ధరించిన ఓ చిన్నపాప ఎక్స్‌ప్రెషన్స్ రికార్డ్ చేసేందుకు తన తండ్రి.. టోపీకి కెమెరా ఫిక్స్ చేశాడు. తన బిడ్డలో నిమిషానికి ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో చూపించేందుకు ప్రయత్నించాడు. అనుకున్న విధంగానే క్యాప్చర్ చేసి సక్సెస్ అయ్యాడు. ముందుగా నవ్విన పాప.. కాసేపటికి మూతి తిప్పుకుంటూ.. నోట్లో వేలు పెట్టుకుని కనిపించింది.. ఆ తర్వాత కింద పడిపోయి ఏడ్చింది.. దగ్గరకు తీసుకుని ఓదార్చగానే కామ్ అయింది.. మళ్లీ నవ్వింది.. జస్ట్ నిమిషం కన్నా తక్కువ వ్యవధిలోనే ఇన్ని భావోద్వేగాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
‘‘ నాకు పెళ్లికాకపోయినా పర్లేదు బ్రో.. ఇలాంటి బిడ్డను కనాలని ఉంది’’, ‘‘పొట్టిదానా.. ఇంత క్యూట్‌గా ఉండటం క్రైమ్ తెలుసా?’’, ‘‘అడోరబుల్’’, ‘‘ఇలాంటి వీడియోల కోసమే నేను ఇంటర్నెట్ బిల్లు కడుతున్నా’’, ‘‘ఇంత క్యూట్ వీడియోకు నెట్ బిల్లు లక్షలు కట్టినా పర్లేదు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే వేగవంతమైన మానసిక స్థితి మార్పులను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే వారి భావోద్వేగాలను నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్.. 24 సంవత్సరాల వయస్సు వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇలా టోపీపై ధరించిన కెమెరాను సాధారణంగా సంభాషణలను రహస్యంగా డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చట్టపరమైన, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే అటువంటి రికార్డింగ్‌లపై దేశాలు, రాష్ట్రాల వారీగా చట్టాలు వారీగా మారుతాయి.






