- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి వద్దు బాబోయ్.. ప్రతీ నలుగురిలో ఒకరి ఫీలింగ్ ఇదే..!
పెళ్లి వద్దు బాబోయ్.. ప్రతీ నలుగురిలో ఒకరి ఫీలింగ్ ఇదే..!

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు 18 ఏండ్లు దాటగానే పెళ్లి చేసుకోసుకోవాలనే ఆలోచన యువతలో, వారికి పెళ్లి చేయాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న ఆధునిక సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత అవసరాల కారణంగా ఇప్పుడా ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. భారత దేశంలో ఈ పరిస్థితి కొంచెం తక్కువ కానీ, ఫారెన్ కంట్రీస్‌లో అయితే అధికంగా ఉంది. ప్రతీ నలుగురిలో ఒకరు పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని కార్నెల్ యూనివర్సిటీ అండ్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన రీసెంట్ స్టడీలో వెల్లడైంది.
ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో అయితే దాదాపు 25% మంది వయోజనులు(Adults) తమ జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకపోవచ్చని అధ్యయనం అంచనా వేసింది. కెరీర్ మీద ఫోకస్, మారుతున్న సోషల్ వాల్యూస్, ఆర్థిక స్వాతంత్ర్యం, పర్సనల్ చాయిసెస్ వంటివి ఈ ధోరణికి కారణం అవుతున్నాయని పేర్కొన్నది. ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటమనేది సామాజిక కళంకంగా భావించేవారు కానీ ఇప్పుడది వ్యక్తిగత సాధికారత కలిగిన జీవన శైలిగా మారుతోంది. ఆధునిక సమాజంలో యువతీ యువకులు ఆర్థిక భద్రత, కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా మహిళలు ఆర్థికంగా స్వాతంత్ర్యం సాధిస్తుండటంవల్ల ఈ రోజుల్లో వివాహం ఒక ఆర్థిక భద్రతగా ఉండాలనే అవసరం, ఆలోచన తగ్గాయి. అంతేకాకుండా సమాజంలో వివాహం పట్ల ఉన్న సాంప్రదాయ దృక్పథం మారుతోంది. ఒంటరిగా ఉండటమనేది ఇప్పుడు సెల్ఫ్ ఇండిపెండెన్స్ అండ్ స్వేచ్ఛగా జీవించే అవకాశంగా చూస్తున్నారు. Link






