బ్రిటీష్ గడ్డపై.. 100 ఏళ్ల వీరస్వామి రెస్టారెంట్.!

by Daayi Srishailam |

భారతీయ వంటకాలకు ఫేమస్ అది

బ్రిటీష్ గడ్డపై.. 100 ఏళ్ల వీరస్వామి రెస్టారెంట్.!
X

దిశ, ఫీచర్స్: లండన్లో అదొక రెస్టారెంట్. భారతీయ వంటకాలకు ఫేమస్ అది. మరో రెండు నెలల్లో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ హై రెస్టారెంట్ రెజెంట్ స్ట్రీట్ మూలలో.. విక్టరీ హౌస్ మొదటి అంతస్తులో.. చిన్న ద్వారం దాటిన వెంటనే మనల్ని 1926లోకి తీసుకెళ్తుంది. స్పైసీ మసాలా వాసనలు.. చెక్క ఫర్నీచర్ మీద ఇస్త్రీ చేసిన టేబుల్ క్లాత్.. గోడలపై రాజస్థానీ గ్లాస్ పెయింటింగ్స్‌తో చెక్కు చెదరకుండా ఉంది.

మొదట్లో పచ్చళ్ల ఎగుమతి..

అది.. 1926. ఆ రెస్టారెంట్‌ను తెరిచాడు. ఆంగ్లో-ఇండియన్ అధికారి ఎడ్వర్డ్ పామర్‌కు రెస్టారెంట్ పెట్టాలను ఆలోచన వచ్చింది. అతడు మొఘల్ రాజకుమారి ఫైజాన్ నిస్సా బేగం మనుమడు. ఎడ్వర్డ్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ రాజభవనంలో తిన్న వంటకాలు.. ఆసఫ్ జాహీ లాంబ్ చాప్స్.. కశ్మీరి రోగన్ జోష్.. మలబార్ లాబ్‌స్టర్ కర్రీ.. వంటివి వంటరాలు నేర్చుకున్నాడు. 1896లోనే అతడు "ఈపీ వీరస్వామి అండ్ కో" అనే స్పైసెస్ కంపెనీ ప్రారంభించాడు. దీనిద్వారా బ్రిటన్‌కు కర్రీ పౌడర్.. మామిడికాయ పచ్చళ్లు ఎగుమతి చేశాడు. ఆ అనుభవమే అతడిని రెస్టారెంట్ పెట్టేలా చేసింది.

అన్నీ పాతవే.. వివాదమే కొత్తది..

రెస్టారెంటున్న విక్టరీ హౌస్ భవనం క్రౌన్ ఎస్టేట్‌కు చెందినది. ఇది కింగ్ చార్లెస్ III సంస్థ. కానీ స్వతంత్రంగా నిర్వహిస్తారు. 2025 జూన్‌లో దీని లీజ్ ముగిసింది. క్రౌన్ ఎస్టేట్ ఈ భవనాన్ని పెద్ద ఎత్తున రిఫర్బిష్ చేసి ఆఫీస్ స్పేస్‌గా మార్చాలని నిర్ణయించింది. దీంతో రెస్టారెంట్ ఎంట్రన్స్ కొంత భాగం తీసేస్తారని.. డైనింగ్ రూమ్‌కు యాక్సెస్ లేకుండా పోతుందని రెస్టారెంట్ యజమానులు అంటున్నారు. క్రౌన్ ఎస్టేట్ మాత్రం ఈ భవనాన్ని ఆధునిక వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చాలని.. ఇది తమ బాధ్యత అని చెప్తోంది. వివాదం కోర్టులో ఉంది.

ఇండో-బ్రిటిష్ సంస్కృతి..

యానివర్సరీ ఏప్రిల్‌లో ఉండగా.. కోర్టు తీర్పేమో జూన్లో ఉంది. దీంతో వందేళ్ల వేడుకలు ఎలా జరుగుతాయనేది చర్చనీయాంశంగా మారిందన్నమాట. వీరస్వామి ఇండో-బ్రిటిష్ సాంస్కృతిక చరిత్రలో భాగం.. దాన్ని కాపాడాలి అంటూ కింగ్ చార్లెస్ IIIకి విజ్ఞప్తులు అందాయి. ఈ పిటిషన్‌కు 18,000 మందికి పైగా సంతకాలు కూడా సేకరించారు. త్వరలో బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద దాన్ని సమర్పించనున్నారు. మార్చిలో సెంటెనరీ డిన్నర్ ఏర్పాటు చేసి మరింత మద్దతు సేకరించాలని ప్లాన్ చేస్తున్నారు. అలనాటి రెడ్ వెల్వెట్ కర్టెన్లు.. హ్యాండ్‌మేడ్ చాండెలియర్లు.. రాజస్థానీ కార్పెట్లు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి.

సంపన్నుల డిన్నర్ స్పాట్..

మొదటి రోజుల్లో రెస్టారెంట్‌లో టర్బన్ ధరించిన దర్వాన్ ద్వారం వద్ద నిలబడేవాడు. పంఖా వాళ్లు గాలి ఊపేది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇక్కడికి రెగ్యులర్ గెస్ట్. డెన్మార్క్ ప్రిన్స్ ఆక్సెల్ కార్ల్‌బెర్గ్ బీర్ బ్యారెల్స్ పంపించేవాడు. అందుకే కర్రీకి బీర్ అనే కాంబినేషన్ బ్రిటన్‌లో పుట్టిందట. చార్లీ చాప్లిన్ ఎప్పుడూ వచ్చేవాడు. ఇంకా నెహ్రూ.. ఇందిరా గాంధీ.. మహారాజుల కుటుంబాలకు ఇది ఫేవరెట్ ఫ్యామిలీ రెస్టారెంట్. అప్పటి గోల్డెన్ ఏజ్ రాజకుటుంబాలు.. సినిమా స్టార్లు.. రాజకీయ నాయకులు ఎన్నో అందమైన సాయంత్రాల్లో తారల్లా ఇక్కడ తళుక్కుమనేవాళ్లు. వీరస్వామి రెస్టారెంట్ గురించి తెలిసినవాళ్లెవరూ వీటిని మర్చిపోలేరు.

Next Story