- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోషకాల గని బోడకాకర.. తింటే ఎన్ని లాభాలో..!
పోషకాల గని బోడకాకర.. తింటే ఎన్ని లాభాలో..!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా వర్షాకాలంలో పలు రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అయితే ఇదే సీజన్‌లో లభించే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వాటిని సమస్యలను దూరం చేస్తాయి. అలాంటి వాటిలో అడవి కాకర లేదా బోడకాకర ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఆ కాకర, ఆదొండ కాయ అని కూడా పిలుస్తుంటారు. నిజానికి ఇందులో మటన్, చికెన్ కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతుంటారు. తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం.
*బోడ కాకరలో విటమిన్లు, జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పలు రకాల అనారోగ్య సమస్యలను ఇవి తరిమికొడతాయి. వర్షాకాలంలో తలెత్తే వైరల్ ఫీవర్లను, స్టమక్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టతాయి.
*జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు బోడ కాకరను కూరగా వండుకొని తినడంవల్ల ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఇందులోనిపీచు పదార్థం అజీర్తిని, అధిక బరువు సమస్యలను దూరం చేస్తుంది.
*అడవి కాకరలోని పోషకాలు రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తినడం చాలా ప్రయోజనకరం. అలాగే రక్తపోటు తగ్గాలనుకునేవారు బోడకాకరను వానాకాలం సీజన్ అయిపోయేలోపు వారానికి ఒక్కసారైనా తినాలని పెద్దలు చెబుతుంటారు. కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా ఇది నివారిస్తుంది. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ముఖం, చర్మంపై ముడతలు వంటి సమస్యలను పలువురు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిని దూరం చేయడంలో బోడకాకరలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.






