- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొడవాటి జుట్టు కావాలా..? రోజూ కొన్ని బాదం పప్పులు తినండి చాలు!
రోజుకు 4 నుంచి 6 బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

దిశ, ఫీచర్స్ : జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? మీ జుట్టు బలంగా, పొడుగ్గా మారాలనుకుంటున్నారా? అయితే రోజూ కొన్ని బాదం పప్పులు తినడం చాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వీటిలోని పోషకాలు అందుకు సహాయపడతాయి. ముఖ్యంగా బాదములు బయోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
*బాదంలోని పోషకాలు జుట్టు ఫాలికల్స్‌ను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తాయి. రోజుకు 4 నుంచి 6 బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ విధమైన ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. 4 నుంచి 8 వారాల పాటు ఈ అలవాటును కొనసాగిస్తే, జుట్టు ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
*బాదంపప్పులలోని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, ఒత్తిడి, పర్యావరణ కారకాల వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. బయోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తూ, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బాదంలోని మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి, తలకు అవసరమైన పోషకాలను చేరవేస్తుంది. ఈ సహజ పద్ధతి ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు బలంగా, మృదువుగా, మెరిసేలా మారాలనుకునేవారు ఇది పాటించాలని సూచిస్తున్నారు. Link






