- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజుకు 3 వాల్‌నట్స్‌తో మెదడుకు మేలు.. గుండె జబ్బులకు చెక్!
డైలీ రెండు లేదా మూడు వాల్నట్స్ తినడం వల్ల మెదడులో డోపమైన్, సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల రిస్క్ 15-20% తగ్గుతుంది.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా వాల్నట్స్ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇవి రోజుకు మూడు తినడంవల్ల మెదడు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించడంతోపాటు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల రిస్క్‌ను అరికడతాయి.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. డైలీ రెండు లేదా మూడు వాల్నట్స్ తినడం వల్ల మెదడులో డోపమైన్, సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల రిస్క్ 15-20% తగ్గుతుంది. వాల్‌నట్స్‌లోని ఫాలీ ఫెనాల్స్, విటమిన్ ఇ, మెలటోనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్(మంట)ను తగ్గించి, గుండె జబ్బులను అరికడతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం కూడా వారానికి 5 సార్లు వాల్నట్స్ తినేవారిలో హానికరమైన చెడు కొలెస్ట్రాల్ 10% తగ్గి, గుండెపోటు ముప్పు తప్పుతుంది.
వాల్‌నట్స్‌లోని ఇతర పోషకాలైన ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ వంటివి రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గర్భిణులు వాల్నట్స్ తింటే పుట్టుబోయే బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సమతుల్యం చేయడంలోనూ సహాయపడతాయి. అయితే వీటిలో కేలరీలు అధికంగా ( ప్రతి 28 గ్రాముల్లో 185 కేలరీలు) ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మోడరేషన్లో తినాలి. నట్స్ అలర్జీ ఉన్నవారు ఆరోగ్య నిపుణుల సలహా పాటించాలి. లింక్
Read More..
మొబైల్ రేడియేషన్‌తో తేనెటీగలు నాశనం..! జీవ వైవిధ్యానికి ముప్పేనా?






