Viral : అమ్మాయిలే ముందు ప్రపోజ్ చేస్తున్నారు..! ఆ విషయంలో మారుతున్న ధోరణి!!

by Javid Pasha |

2025లో దాదాపు 15% నుంచి 40% ప్రపోజల్స్ మహిళలే చేస్తున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి.

Viral : అమ్మాయిలే ముందు ప్రపోజ్ చేస్తున్నారు..! ఆ విషయంలో మారుతున్న ధోరణి!!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమలో ఎవరు ముందు పడతారు? ఎవరు ముందుగా ప్రపోజ్ చేస్తారు? అంటే.. అందరూ ఠక్కున చెప్పేమాట అబ్బాయిలే.. కానీ ఇదంతా ఒకప్పుడు! ప్రజెంట్ అమ్మాయిలు ముందుగా ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ పెరుగుతోందని రిలేషన్‌షిప్ & మోటివేషనల్ నిపుణులు అంటున్నారు. ఈ మార్పు లవ్ & కమిట్మెంట్‌ను వ్యక్త పరచడంలో మహిళల ఆత్మ విశ్వాసాన్ని, స్వేచ్ఛను సూచిస్తుందని చెబుతున్నారు.

నిజానికి ప్రపోజల్ అనేది సాంప్రదాయకంగా పురుషుల బాధ్యతగా భావించబడుతూ వచ్చింది. కానీ ఇటీవల సంవత్సరాల్లో అది మారుతోంది. మహిళలు కూడా తమకు నచ్చిన వ్యక్తులకు లేదా భాగస్వాములకు ప్రపోజ్ చేయడం పెరిగింది. అనేక విషయాల్లో ట్రెడీషనల్ జెండర్ రోల్స్‌ను మార్చుకుంటున్న ఈ తరం జంటలు లవ్ అండ్ పార్ట్‌నర్‌షిప్‌ను కొత్తగా నిర్వచించుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇష్టాయిష్టాలు, ప్రేమ, కమిట్మెంట్ వంటి విషయాల్లో ఇకపై ఎవరు అడగాలనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరు రెడీగా ఉన్నారనేదే ముఖ్యం!

ప్రముఖ ‘వెడ్డింగ్ & ప్లానింగ్ వెబ్‌సైట్’ 2017లో The Knot పేరుతో నిర్వహించిన సర్వే ప్రకారం.. 1% మహిళలు మాత్రమే ప్రపోజ్ చేశారు. కానీ 2018లో ఈ పరిస్థితి మారింది. మహిళలు పురుషులకు ప్రపోజ్ చేయడానికి సంబంధించిన సెర్చెస్ 336% పెరిగాయి. 2025లో దాదాపు 15% నుంచి 40% ప్రపోజల్స్ మహిళలే చేస్తున్నారని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ ట్రెండ్ పెరగడానికి ప్రధాన కారణాలు జెండర్ ఈక్వాలిటీపట్ల పెరుగుతున్న అవగాహనే అంటున్నారు నిపుణులు. పురుషులతో పోల్చినప్పుడు ముందుగా ప్రపోజ్ చేసే మహిళల సంఖ్య ఇప్పటికే తక్కువే అయినప్పటికీ, మహిళలు ప్రపోజ్ చేయడం అనేది గతంకంటే పెరుగుతూ వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్లడించడం సాధారణమవుతోంది. మహిళలు తమ భావాలను ముందుగా వ్యక్త పరచడం ద్వారా సంబంధాల్లో సమానత్వం పెరగడమే కాకుండా, మరింత మ్యూచువల్ రెస్పెక్ట్‌తో కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు.

Next Story