- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఆరోగ్యంగా ఉండటం దీర్ఘాయుష్షును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ప్రేమ, బలమైన సంబంధాలు కూడా చాలా ముఖ్యమని, మనిషి జీవన కాలాన్ని పొడిగిస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ డెవలప్‌మెంట్ 85 సంవత్సరాల పాటు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘాయుష్షుకు, ఆనందానికి నిజమైన రహస్యం ఇదేనని స్పష్టం చేసింది. ఆ వివరాలేమిటో చూద్దాం.
ఎంత రుచికరమైన ఆహారం తిన్నా, ఎన్ని వ్యాయామాలు చేసినా మీతో ప్రేమగా మాట్లాడే వారు, అవసరమైనప్పుడు ఎమోషనల్ సపోర్ట్ అందించేవారు లేకుంటే దండగే. ఎందుకంటే అలాంటి బలమైన సంబంధాలుంటేనే మీరు ఎక్కువకాలం జీవిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. సన్నిహిత సంబంధాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. వాస్తవానికి ప్రేమతో కూడిన సంబంధాలు లేని ఒంటరితనం, రోజుకు 15 సిగరెట్లు తాగినంత హానికరమని కూడా అధ్యయనం స్పష్టం చేసింది.
స్నేహితులు, సహచరులు, కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే.. మీతో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడం, సరదాగా కాసేపు మాట్లాడటం వంటివి మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా కష్ట సమయాల్లో స్నేహితులు, కుటుంబం మానసిక, భావోద్వేగ మద్దతు అందిస్తారు. ఈ విధమైన సంబంధాలు గుండె జబ్బులు, డిప్రెషన్ వంటివి రాకుండా నివారించగలుగతాయని అధ్యయనం పేర్కొన్నది. అందుకే సంతోషకరమైన జీవితానికి, దీర్ఘాయుష్షు కోసం స్నేహితులతో కలవడం, కుటుంబంతో సమయం గడపడం, ఒంటరితనాన్ని నివారించడం వంటివి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల మధ్య ప్రేమ, బలమైన సామాజిక సంబంధాలను మేనేజ్ చేయగలిగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.Link






