- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : వామ్మో.. పామునే మింగేసిన కప్ప.. ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుందంటే ఇదేనేమో భయ్యా !!
Viral video : వామ్మో.. పామునే మింగేసిన కప్ప.. ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుందంటే ఇదేనేమో భయ్యా !!

దిశ, ఫీచర్స్ : ఒకానొక సందర్భం వస్తే పిల్లి కూడా తిరగబడుతుంది అంటుంటారు. సంకల్ప బలం తోడైతే కుందేలు కూడా పులిని వేటాడుతుందని కూడా చెబుతుంటారు. అంటే అహంకారంతోనో, గర్వంతోనో, అతి విశ్వాసంతోనో ఇతరులను చులకనగా చూసేవారినుద్దేశించి ఈ ఉదాహరణలు వాడుతుంటారు ప్రజలు. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని, ప్రతీ ఒక్కరికి మంచి సమయం వస్తుందని, కష్టాలు, సమస్యలు శాశ్వతం కాదని, దురాశ, దురహంకారం ఓడిపోక తప్పదని కూడా దీని అంతరార్థం. అలాంటి సన్నివేశాన్ని గుర్తుచేసే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింటల్ హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా!
వైరల్ వీడియో ప్రకారం.. అదొక నిర్మానుష్య అటవీ ప్రాంతం. చుట్టూ చెట్లు, ఎండిన గడ్డితో కూడిన ఆ ఏరియాలోకి ఒక గ్రీన్ కలర్ కప్ప వచ్చింది. బహుశా ఆహారం కోసం పురుగులను వెతుకుతోంది. అంతలోనే ఆహార వేటలో భాగంగా ఒక పాము కూడా ఈ ప్రాంతంలోకి వచ్చింది. సాధారణంగా పాములు కప్పలను తింటాయి. కప్పలు చిన్న చిన్న పురుగులను తింటాయి. ఇది వాటి ఆహారపు అలవాట్లలో భాగం. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయింది. ఎకప్పే పామును నోటితో కరిచి మింగసాగింది. ఈ సందర్భంగా పాము, కప్ప మధ్య పెనుగులాట జరిగినప్పటికీ, కప్పదే పైచేయి అయింది. పామును నోటితో కరిచి, కాళ్లతో లోపలికి నెట్టుకుంటూ మింగేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ చూసేయండి!






