- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : వందేళ్లయినా పాడవని ‘అణు’గడియారం.. సాంకేతికతలో మరో ఆవిష్కరణ ?!
Technology : వందేళ్లయినా పాడవని ‘అణు’గడియారం.. సాంకేతికతలో మరో ఆవిష్కరణ ?!

దిశ, ఫీచర్స్ : గోడ గడియారం కానీ.. చేతి గడియారం(clock) కానీ.. ఆగిపోకుండా ఎన్నేండ్లు పనిచేస్తుంది? ఒకటి, రెండు, మహా అయితే మూడు. మధ్యలో ఏదో ఒక రిపేర్ వస్తుంది. బ్యాటరీతో నడిచేది అయితే తరచుగా దానిని మార్చాల్సి వస్తుంది. ఓ గడియారం మాత్రం అలా కాదండోయ్. వందేండ్ల వరకు అస్సలు పాడవదు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ(NIST)కి చెందిన నిపుణులు తయారు చేసిన ఈ ‘NIST-F4 అటామిక్ క్లాక్’ కచ్చితమైన సమయాన్ని లెక్కిస్తూ ఎన్నటికీ పాడవని గొప్ప సాంకేతిక పరికరంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఎన్ఐఎస్‌టి ఎఫ్ - 4 అటామిక్ క్లాక్ అత్యంత కచ్చితమైన సమయ లెక్కింపు పరికరం. అయితే ఇది డైనోసర్ల కాలం నుంచి కొనసాగుతూ వచ్చిన కాలాన్ని ఒక సెకను తేడాతో చూపిస్తుందని చెబుతున్నారు. పైగా ఇది సీసియం(cesium) అణువుల సహజ కంపనాలను ట్రాక్ చేస్తూ.. చల్లబరిచిన అణువులను ఫౌంటైన్ లాంటి కదలికలో పైకి విసిరి, మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా ఒక సెకనుకు 9,192,631,770 (9 కోట్ల,19 లక్షల, 26 వేల, 770) టిక్‌లను లెక్కిస్తుంది. కాగా ఈ క్లాక్ అమెరికన్ అఫీషియల్ టైమ్‌ను మేనేజ్ చేస్తూ.. జీపీఎస్, గ్లోబల్ కమ్యూనికేషన్స్, ఆర్థిక లావాదేవీలలో సమకాలీకరణను నిర్ధారిస్తుంది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన, మన్నికైన గడియారంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ విధమైన అధికారిక గుర్తింపుకోసం రీసెర్చర్స్ ఎదురు చూస్తున్నారు.
ఎన్ఐఎస్‌టి ఎఫ్ - 4 అటామిక్ క్లాక్ అమెరికన్ అధికారిక సమయాన్ని నిర్వహించడంతోపాటు జీపీఎస్, గ్లోబల్ కమ్యూనికేషన్స్, అలాగే ఆర్థిక లావాదేవీల వంటి వ్యవస్థలలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు సమకాలీకరణ (Sink)లో ఉండటానికి అత్యంత కచ్చితమైన సమయం అవసరం. ఉదాహరణకు జీపీఎస్ నావిగేషన్ కోసం మైక్రోసెకన్లలో కచ్చితమైన నిర్ధారిత సమయం అవసరం. అట్లనే ఆర్థిక లావాదేవీలలో సమయ గుర్తింపు కీలకం. ఇవన్నీ ఎన్ఐఎస్‌టి ఎఫ్ - 4 అటామిక్ క్లాక్ ద్వారా సాధ్యం అవుతాయి. అంతేకాకుండా శాస్త్రీయ పరిశోధనలు, ఖగోళ శాస్త్రం, టెక్నాలజీ ఆవిష్కరణలో కూడా కీ రోల్ పోషిస్తుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు.






