Viral : అందుబాటులోకి ఏఐ ఫోన్..! ఇక స్మార్ట్‌ఫోన్లు పక్కన పెట్టాల్సిందేనా?

by Javid Pasha |   (  Updated:2026-05-02 09:15:35  IST  )

ఏఐ ఫోన్‌ను వినియోగిస్తున్నప్పుడు నిరంతరం ట్యాప్ చేయాల్సిన అవసరం ఉండదు. యూజర్లు ఏదైనా చెప్పగానే అర్థం చేసుకొని, స్వయంగా పని పూర్తి చేసి ఇస్తుంది.

Viral : అందుబాటులోకి ఏఐ ఫోన్..! ఇక స్మార్ట్‌ఫోన్లు పక్కన పెట్టాల్సిందేనా?
X

దిశ, ఫీచర్స్ : ఏఐ అందుబాటులోకి వచ్చాక దానిని చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇందుకోసం చాట్‌జీపీటీ, మెటా ఏఐ వంటి ప్రత్యేక యాప్‌లు లేదా సైట్ల ద్వారా యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓపెన్‌ఏఐ తన మొదటి ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను డెవలప్ చేస్తన్నది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ న్యూజనరేషన్ ఫోన్ సాంప్రదాయిక స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఏఐ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి ఆయా యాప్స్‌ మధ్య మారడంర, నిరంతరం ట్యాప్ చేయడం వంటి అవసరం ఉండదు. ఎందుకంటే యూజర్లు తమ ఫోన్‌కు ఏదైనా చెప్పగానే అది అర్థం చేసుకొని, స్వయంగా పనిపూర్తి చేసి ఇస్తుంది. అంటే ఇది చాట్‌జీపీటీ వంటి అధునాతన ఏఐ మోడల్స్‌తో పనిచేస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఇది సాధారణ కమాండ్స్‌కు బదులు వినియోగదారు ఉద్దేశాన్ని సైతం అర్థం చేసుకొని, పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఉదాహరణకు ‘నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి, హోటల్ రిజర్వ్ చేయి, మీటింగ్ ఏర్పాటు చేయి’’ అని చెప్పగానే ఆటోమేటిగ్గా షెడ్యూల్ చేసేస్తుంది. ఇటువంటి మార్పు యాప్ బేస్డ్ వాడకం నుంచి అవుట్ కమ్-బేస్డ్ అనుభవానికి మార్చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు పెద్ద సవాలే ఎదురవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏఐ ఫోన్ స్మార్ట్‌‌ఫోన్ రంగంలో పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకురానుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుందనేది అఫీషియల్‌గా ప్రకటించలేదు.

Next Story