- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూడు పెట్టిన.. కూతురు బొమ్మ..! కట్ చేస్తే ఇప్పుడామె లక్షాధికారి!!
కూడు పెట్టిన.. కూతురు బొమ్మ..! కట్ చేస్తే ఇప్పుడామె లక్షాధికారి!!

దిశ, ఫీచర్స్ : పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉండవ్. ఒక్కోసారి తిరగబడుతుంటాయి. సంతోషంగా బతుకున్న సమయంలోనే సడెన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. బెంగుళూరుకు చెందిన దివ్య తేజస్విని జీవితంలోనూ అదే జరిగింది. నిజానికి ఆమె ఒకప్పుడు ప్రైవేట్ టీచర్. భర్త కూడా ఓ సాధారణ ప్రైవేట్ ఉద్యోగి. వారికో చిన్నపాప కూడా ఉంది. అయితే అలా సంతోషంగా గడుస్తున్న వారిజీవితంలో అనుకోని సమస్యలు ఆపదకు కారణం అయ్యాయి. ఆ సమస్యల్లో నుంచి బయటపడేందుకూ కొత్త దారులు దొరికాయి.
కరోనా ఎఫెక్ట్..
అది 2020 కోవిడ్ -19 తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమయం. లాక్ డౌన్, భౌతిక దూరం వంటి పరిస్థితుల కారణంగా అనేకమంది ఉపాధి కోల్పోయారు. దివ్యతేజస్విని దంపతులకూ అదే పరిస్థితి ఎదురైంది. భార్యా భర్తలిద్దరూ జాబ్స్ కోల్పోయారు. ఇంకేముంది. ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఓ వైపు బయట అడుగు పెట్టే పరిస్థితుల్లేవ్. మరోవైపు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. పూట గడవడమే కష్టంగా మారింది.
కూతురు బొమ్మతో..
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దివ్య తేజస్విని ఓ రోజు ఎలా బయటపడాలో ఆలోచిస్తోంది. ఆమె ఎదురుగా తన గారాల కూతురు బొమ్మతో సంతోషంగా ఆడుకుంటూ ఉంది. అది చూసిన దివ్యకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే.. బొమ్మకు భారతీయ సంప్రదాయ దుస్తులను తొడిగి కూతురుకు ఇస్తే మరింత సంతోష పడుతుందని అలా చేసింది. అట్లనే ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పోస్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమకు అలాంటి బొమ్మలు కావాలని, అలా చేసి ఇస్తారా అని నెటిజన్లు అడుగసాగారు. సరే అనేసరికి 20 ఆర్డర్లు వచ్చాయి. అప్పుడే ఆమెకు సరికొత్త ఐడియా వచ్చింది.
లక్షల్లో ఆదాయం..
తన కూతురు ఆడుకుంటున్న బొమ్మకు దుస్తులు తొడిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే దివ్య జీవితాన్ని మలుపు తిప్పింది. మంచి స్పందన రావడంతోపాటు బొమ్మలను అమ్మే బిజినెస్ స్టార్ట్ చేస్తే తనకు ఉపాధి లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అనుకుంది. అలా 2020లో ‘లలితా డాల్స్’ అనే చిన్నపాటి వెంచర్‌ను ప్రారంభించింది. ఇంకేముందు ప్రజల నుంచి మంచి స్పందన, ఆర్డర్లు రావడంతో వ్యాపారం మరింత వృద్ధి చెందింది. ప్రస్తుతం ‘దివ్య డాల్స్’ పేరుగల ఆటబొమ్మలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, మలేషియా, కొరియా వంటి దేశాల్లోనూ ఫుల్ పాపులర్ అయిపోయాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా దివ్య తేజస్విని సంవత్సరానికి రూ. 10 లక్షలకు పైగానే సంపాదిస్తోంది. తన 35 ఏండ్ల వయసులో మరో ఐదుగురు ఉపాధి కల్పిస్తోంది దివ్య తేజస్విని.






