థైరాయిడ్ పేషేంట్లకు కొత్త ముప్పు

by Muthe.Rajitha |

థైరాయిడ్‌ పేషేంట్లు మరో కొత్త ముప్పును ఎదుర్కోబోతున్నారని పరిశోధకులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ పేషేంట్లకు కొత్త ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : థైరాయిడ్‌ పేషేంట్లు మరో కొత్త ముప్పును ఎదుర్కోబోతున్నారని పరిశోధకులు సూచిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వ్యక్తులు ఆర్థరైటిస్‌కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రారంభంలో ఆకలి తగ్గడం, జ్వరం, నీరసం, బరువు తగ్గడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయని, అది క్రమంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం, కదలిక తగ్గడం వంటి సమస్యలు తీవ్రంగా వ్యక్తమవుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి హృదయం, ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలపైనా ప్రభావం చూపవచ్చనని అంటున్నారు.

ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం, నిత్యమైన వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. తద్వారా కీళ్ల నొప్పిని తగ్గించడంతో పాటు రోజువారీ పనులను సులభంగా నిర్వహించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే థైరాయిడ్ మాత్రమే కాదు, అబార్షన్ సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Next Story