- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుస్తున్న బిడ్డను ఓదారిస్తే బరువు తగ్గొచ్చు.. ఎలా?
గుక్కపట్టి ఏడుస్తున్న చంటిబిడ్డను ఓదార్చడం ఒకింత కష్టమైన పనే. సాధారణంగా పాలు పట్టడం, ఊయలలో ఊపడం లేదంటే జోల పాడటం ద్వారా వారిని సముదాయిస్తాం.

దిశ, ఫీచర్స్ : గుక్కపట్టి ఏడుస్తున్న చంటిబిడ్డను ఓదార్చడం ఒకింత కష్టమైన పనే. సాధారణంగా పాలు పట్టడం, ఊయలలో ఊపడం లేదంటే జోల పాడటంతో వారిని సముదాయిస్తాం. కానీ ఇవేవీ కాకుండా శిశువులను శాంతపరిచేందుకు మరొక సింపుల్ టెక్నిక్ కనుగొన్న శాస్త్రవేత్తలు.. వారితో కలిసి నడిస్తే ఏడుపు ఆపేస్తారని వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రక్రియలో కొన్ని కేలరీస్ కూడా బర్న్ చేయొచ్చని చెబుతున్నారు.
ఊయల లేదా ఎత్తుకుని ఆడిస్తే చంటి పిల్లలు కూల్ అవుతారని చాలామంది నమ్ముతారు. కానీ వారితో షికారుచేసే ట్రిక్ ఈ విషయంలో బాగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఫీలింగ్ లేదా ఎత్తుకుని తిరగడం శిశువు హృదయ స్పందన రేటును తగ్గించడంలో సాయపడుతుంది. ఇది వారిని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా తిప్పడం శిశువు నిద్రించేందుకు కూడా తోడ్పడుతుందని జపాన్‌లోని రికెన్ సెంటర్ ఫర్ బ్రెయిన్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కోతులు, ఎలుకలు, కుక్కలకు కూడా ఈ ట్రిక్ పనిచేస్తుందని వెల్లడించారు.
శాస్త్రవేత్తలు.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, ఆపై తల్లిదండ్రులు ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు వారి హృదయం స్పందన రేటును రికార్డ్ చేశారు. ఇందులో వారిని చుట్టుపక్కలకు తీసుకెళ్లడం, కూర్చున్నప్పుడు పట్టుకోవడం, స్త్రోలర్‌లో కూర్చోబెట్టి నెట్టడం వంటివి ఉన్నాయి. అయితే వీటన్నింటిలో వారితో కలిసి వాకింగ్‌కు వెళ్లడం ఉత్తమంగా పనిచేసింది. ఈ ప్రాక్టీస్‌లో సగం మంది పిల్లలు నిద్రపోయారు. అందుకే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు శిశువుతో నడవడమే వారిని ప్రశాంతంగా ఉంచగలిగే ఉత్తమ మార్గం. ఈ టెక్నిక్ కొన్ని కేలరీలను బర్న్ చేయడంలో సాయపడి బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుంది. ఇక శిశువుల ఏడుపు తగ్గితే ఆటోమేటిక్‌గా పేరెంట్స్‌లో ఒత్తిడి కూడా తగ్గుతుంది.






