నిద్రలేమితో సెల్ఫిష్‌గా తయారవుతున్న మనుషులు

by Disha Web Desk 7 |
నిద్రలేమితో సెల్ఫిష్‌గా తయారవుతున్న మనుషులు
X

దిశ, ఫీచర్స్ : కంటినిండా నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుందని డాక్టర్లు ఎప్పుడూ చెప్తుంటారు. అంతేకాదు నిద్ర లేమితో హృదయ సంబంధ వ్యాధులు, డిప్రెషన్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ తదితర ప్రమాదకర అనారోగ్యాలు ముడిపడి ఉంటాయి. అలానే నిద్రలేని రాత్రులు మనుషుల్లో స్వార్థపూరిత ప్రవర్తనకు దారితీస్తాయని కొత్త అధ్యయనం పేర్కొంది. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, నిద్ర లేమి మానవుల ప్రాథమిక సామాజిక మనస్సాక్షిని కూడా దెబ్బతీస్తుంది. ఈ కారణంగానే ఇతరులకు సాయపడాలనే ఆలోచన, సుముఖత తగ్గిపోతుందని వెల్లడైంది.

పరిశోధకులు ఏం కనుగొన్నారు?

యూఎస్ పరిశోధకులు మూడు అధ్యయనాల ఆధారంగా నాడీ కార్యకలాపాలు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే ప్రవర్తనలో మార్పులను విశ్లేషించారు. అయితే కొద్దిపాటి నిద్ర తగ్గినపుడు కూడా ఈ 'సెల్ఫిష్' ఎఫెక్ట్‌ ప్రబలంగా ఉందని కనుగొన్నారు. సరిపడా నిద్ర లేకపోవడం ఒక వ్యక్తి మానసిక, శారీరక శ్రేయస్సునే కాక వ్యక్తుల మధ్య బంధాలను, పరోపకార భావాలను కూడా దెబ్బతీస్తుందని ఈ అధ్యయనం సూచించింది.

నిద్రలేమితో ప్రజల్లో తగ్గుతున్న దానగుణం

అధ్యయనం ప్రకారం చాలా రాష్ట్రాల్లోని నివాసితులు రోజులో ఒక గంట నిద్రా సమయాన్ని కోల్పోయినప్పుడు వారిలో దాన గుణం 10% తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. తగినంత నిద్ర పొందిన వారిలో ఈ ప్రభావం లేదు. ఇది 2001-16 మధ్య యూఎస్‌లో చేసిన 3 మిలియన్ చారిటబుల్ డొనేషన్స్‌ డీటెయిల్స్ డేటా బేస్‌ ఆధారంగా తెలిసింది. అంతేకాదు నిద్రలేమి వ్యక్తుల మధ్య సామాజిక పరస్పర చర్యలను, చివరకు మానవ సమాజ ఆకృతిని కూడా దిగజార్చుతుందని ఈ కొత్త పరిశోధన చూపిస్తోంది.

సాయపడే ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుంది?

పరిశోధకులు 8 గంటల నిద్రపోయినప్పటి, ఒక రాత్రి నిద్రపోకుండా ఉన్నప్పటి మానసిక స్థితిని తెలుసుకునేందుకు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజర్(ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ) ద్వారా 24 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్ల మెదడులను స్కాన్ చేశారు. అయితే స్లీప్‌లెస్ నైట్ అనేది మెదడులో మైండ్ నెట్‌వర్క్ సిద్ధాంతాన్ని ఏర్పరుస్తుంది. ఇది వ్యక్తులు ఇతరులతో సానుభూతి పొందినప్పుడు లేదా ఇతరుల కోరికలు, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో చురుగ్గా పనిచేయదని సైంటిస్టులు కనుగొన్నారు.

వారానికి ఇన్నిసార్లు SEX చేస్తే కరోనా కూడా లైట్‌.. స్ట‌డీలో వెల్ల‌డి


Next Story

Most Viewed