పురుషుల్లో బర్త్ కంట్రోల్.. కొత్త ఆప్షన్స్?

by Chukka Sudharani |

మహిళల్లో బర్త్ కంట్రోల్ రివర్సిబుల్ ప్రొసీజర్స్ విషయానికొస్తే.. పిల్స్ నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్, ఇంప్లాంట్, ప్యాచ్, గర్భాశయ పరికరం(IUD),

పురుషుల్లో బర్త్ కంట్రోల్.. కొత్త ఆప్షన్స్?
X

దిశ, ఫీచర్స్ : మహిళల్లో బర్త్ కంట్రోల్ రివర్సిబుల్ ప్రొసీజర్స్ విషయానికొస్తే.. పిల్స్ నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్, ఇంప్లాంట్, ప్యాచ్, గర్భాశయ పరికరం(IUD), డయాఫ్రాగమ్, వెజీనల్ రింగ్, ఫిమేల్ కండోమ్స్ లేదా స్పెర్మిసైడ్ వరకు డజన్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పురుషుల్లో జనన నియంత్రణకు కండోమ్ ధరించడం లేదా వేసెక్టమీ చేయించుకోవడం తప్ప మరో మార్గం లేదు. పైగా గర్భ నిరోధానికి మిలియన్ల కొద్దీ వీర్య కణాలను నిలిపివేసేందుకు ప్రయత్నించడం కంటే అండాల విడుదలను నిరోధించడం సులభమనే వాదనలున్నాయి. కానీ అనుకోని గర్భాల నుంచి మహిళలను రక్షించాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొత్తగా మేల్ కాంట్రాసెప్షన్ పద్ధతులు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. మరి భవిష్యత్తులో పురుషులకు ఎలాంటి ఎంపికలు ఉండవచ్చు? అందులో అత్యంత ఆశాజనకమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ పురుషులు తమ మహిళా భాగస్వాములకు జనన నియంత్రణ భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆసక్తి చూపుతున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. 2018 YouGov పోల్ సర్వేలో పాల్గొన్న 1,600 మంది బ్రిటిష్ పురుషుల్లో 79 శాతం మంది గర్భనిరోధకాన్ని ఉమ్మడి బాధ్యతగా భావించారు.

మేల్ పిల్

మిన్నెసోటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము మేల్ కాంట్రాసెప్షన్ పిల్‌ను అభివృద్ధి చేశామని ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించారు. ఇది ఎలుకల్లో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా 99 శాతం ప్రభావవంతంగా ఉందన్నారు. రాబోయే నెలల్లో మానవ పరీక్షలను ప్రారంభించాలని వీరి బృందం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కనీసం 5 నుంచి 10 ఏళ్లు పడుతుందనేది నిపుణుల అంచనా. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్‌లో సదరు ఉత్పత్తి గర్భాలను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని, ఆ పిల్ ఉపయోగించిన జంట ఒకవేళ భవిష్యత్‌లో బిడ్డను కోరుకుంటే తిరిగి గర్భం దాల్చవచ్చని నిరూపించాలి. ఇదేకాక పరిశోధకులు 'డైమెథాండ్రోలోన్ అన్‌కానోయేట్ లేదా DMAU' కలిగిన మగ గర్భనిరోధక మాత్రపై కూడా పని చేస్తున్నారు. ఈ అణువు దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు కలిగించే ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుంది. ఇది ఆచరణీయ స్పెర్మ్‌ను సృష్టించడానికి అవసరమైన 'ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్(FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH)'ను అణిచివేస్తుంది.

షోల్డర్ జెల్

పురుషుల భుజాలు, వీపుపై ప్రతిరోజూ టెస్టోస్టెరాన్ జెల్‌ను పూయడం ద్వారా బర్త్ కంట్రోల్ సాధించవచ్చు. 'NES/T'గా పిలువబడే ఈ జెల్.. టెస్టోస్టెరాన్, ప్రొజెస్టిన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది ఫిమేల్ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్‌కు సింథటిక్ రూపం. ప్రొజెస్టిన్ వృషణాల్లో సహజమైన టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. స్పెర్మ్ ఉత్పత్తిని తక్కువ లేదా లేనిస్థాయికి తగ్గిస్తుంది. ఇక రీప్లేస్‌మెంట్ టెస్టోస్టెరాన్ సాధారణ సెక్స్ డ్రైవ్, ఇతర హార్మోన్-ఆధారిత విధులను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ జెల్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అంచనా వేయబడుతోంది. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ ఆండర్సన్.. 30 మంది పురుషులపై ఇప్పటికే పూర్తిచేసిన ట్రయల్స్‌లో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు తెలిపారు. దీనిని ప్రతిరోజూ ఉపయోగించినప్పుడు చర్మం ఉపరితలంపై ఉండి స్థిరంగా పంపిణీ చేస్తుంది. దీని ప్రభావం మూడు రోజుల వరకు సమర్థవంతంగా ఉంటుంది. కానీ ఇది కూడా మార్కెట్‌లోకి వచ్చేందుకు చాలాకాలమే పట్టవచ్చు.

రివర్సిబుల్ వేసెక్టమీ : ఒక్సారి సెట్ చేసి మర్చిపోవచ్చు!

కొత్త మేల్ కాంట్రాసెప్షన్స్‌పై పరిశోధనను సమర్థించేవారు నాన్-హార్మోన్ పద్ధతులను ఉత్తమంగా సూచిస్తున్నారు. వీటిలో 'వాస్-ఆక్లూసివ్ టెక్నిక్స్' లేదా రివర్సిబుల్ వేసెక్టమీ ఉన్నాయి. ఇది వాస్ డిఫెరెన్స్‌లోకి జెల్‌ను ఇంప్లాంట్ చేయడం ద్వారా పనిచేస్తుంది(పురుషాంగం లోపల ఉన్న వాహిక, దీని ద్వారానే స్పెర్మ్ శరీరం నుంచి బయలుదేరుతుంది). ఇది ద్రవాన్ని ప్రవహించేలా చేసి స్పెర్మ్‌ను మాత్రం అడ్డుకుంటుంది. ఈ జెల్ సహజంగా కరిగిపోవడం ప్రారంభించే వరకు లేదా పురుషుడు తన స్పెర్మ్ మళ్లీ స్వేచ్ఛగా సంచరించడానికి దానిని తీసివేయాలని నిర్ణయించుకునే వరకు చాలా ఏళ్ల పాటు కొనసాగే వన్-టైమ్ ఔట్ పేషెంట్ ప్రక్రియగా అభివృద్ధి చేయబడుతోంది.

భారత్‌లోని శాస్త్రవేత్తలు నాలుగు దశాబ్దాలుగా RISUG (రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) అని పిలువబడే వాస్-ఆక్లూజివ్ సింథటిక్ జెల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఏకైక పురుష గర్భనిరోధకం.

విలువ కంటే ఇబ్బందే ఎక్కువా?

'పై పద్ధతులు ఆశాజనకంగా లేదా కలవరపెట్టేలా ఉన్నప్పటికీ ఈ కొత్త ఎంపికలు ప్రపంచవ్యాప్తంగా పురుషులకు వాస్తవికతగా మారేందుకు ఇంకా సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన రోగిని తీసుకొని, ఒక ఫంక్షన్ (పునరుత్పత్తి) నిలిపివేయాలని, దానిని పునరుద్ధరించవచ్చని వాగ్దానం చేస్తే.. ఆ వ్యాధికి చికిత్స చేయడం కంటే తిరిగి వచ్చే విషయంలోనే అది చాలా ప్రమాదకరం. రెగ్యులేటరీ దృక్కోణంలో.. 'గర్భాన్ని నిరోధించే అంతిమ లక్ష్యం' నెరవేరకుండా అది వారి భాగస్వామిని ప్రభావితం చేసిన పక్షంలో సంభావ్య దుష్ప్రభావాలతో కూడిన మందులను అందించడం కూడా కొంతవరకు నైతిక తలనొప్పి. కాబట్టి మరిన్ని మేల్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ కోసం పిలుపునిచ్చేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

- హీథర్ వాహ్‌దత్, మేల్ కాంట్రాసెప్టి్వ్ ఇనిషియేటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

Next Story