- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్ Z తరం న్యూ ఫార్ములా.. కేరీర్ ముఖ్యం కాదు బిగిలు.. పర్సనల్ లైఫే ఫస్టు!
1997 నుంచి 2012 మధ్యలో జన్మించినవారిని జెన్ Z తరంగా పిలుస్తారు. ఈ తరం వ్యక్తులు డిజిటల్ యుగంలో జన్మించి,

దిశ, వెబ్ డెస్క్: 1997 నుంచి 2012 మధ్యలో జన్మించినవారిని జెన్ Z (Gen Z) తరంగా పిలుస్తారు. ఈ తరం వ్యక్తులు డిజిటల్ యుగంలో (Digital era) జన్మించి, టెక్నాలజీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వంటివాటితో పెరిగారు. అందుకే వీరిని 'డిజిటల్ నేటివ్‌లు' (Digital Natives) అని కూడా అంటారు. ఇక ముందు తరాలతో పోల్చితే.. ఈ జనరేషన్ యువత ప్రతి ఒక్క విషయాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. పాత తరంలో పాటించే పద్ధతులను అస్సలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో.. పని అంటే ఒట్టిగా కూర్చుని కష్టపడాలనే తత్వాన్ని అస్సలు పట్టించుకోరు. 9 నుంచి 5 జాబ్, పదేళ్లకుపైగా ఒకే ఉద్యోగంలో ఉండటం, ఒవర్ టైమ్ వర్క్ చేయటం, సెలవుల కోసం మేనేజర్ ముందు అడగడం వంటి వాటికి వీరు దూరంగా ఉంటున్నారు.
ఈ తరం యువతకు ఉద్యోగం అనేది కేవలం డబ్బు సంపాదన కోసం కాకుండా.. తమ అభిరుచులు, విలువలు, వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జెన్ Z తరం యువతకు ఉద్యోగంలో ఫ్లెక్సిబిలిటీ (Flexibility) చాలా ముఖ్యం అని భావిస్తోంది. ఎక్కడ పని చేస్తున్నామన్నదేమీ కాదు.. ఎలా, ఎప్పుడు పని చేస్తున్నామన్నదే కీలకం అని చెబుతోంది. వర్క్ ఫ్రం హోం, తమకు నచ్చిన టైంలో పనిచేయటం, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులకు మొగ్గు చూపటం వీరి నూతన జీవన శైలికి అద్ధం పడుతోంది. అలాగే, జీతం ఎంత ఇస్తారు? అనే దానికన్నా.. ఆ ఉద్యోగం వాళ్ల తమ ప్రతిభ ఎంత మేరకు వెలుగులోకి వస్తుంది, తమను ప్రపంచానికి ఎలా చూపిస్తుంది, అనే పర్సనల్ బ్రాండింగ్‌ను ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక ఒక్కమాటలో చెప్పాలంటే.. కెరీర్ కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యం అనే భావన జెన్ Zలో బలంగా కనిపిస్తోంది. ఒత్తిడితో ఉన్న ఉద్యోగం కంటే, ఆరోగ్యంగా జీవించడమే ముఖ్యమని నమ్ముతున్నారు. అందుకే ఉద్యోగ భద్రత కంటే, ఆత్మసంతృప్తి, ఆరోగ్యం, కుటుంబం, హాబీలు వంటివి ఈ తరం ప్రాధాన్యతలో ముందు వరుసలో ఉంటున్నాయి. ఇక ఈ తరం ధోరణుల కారణంగా కంపెనీలు కూడా ఉద్యోగాల్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాయి. రిమోట్ వర్క్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు వంటి వాటికి శ్రద్ధ చూపుతున్నాయి. వారికి కావాల్సిని సౌకర్యాలు అందించకపోతే, జెన్ Z యువత ఆ సంస్థల్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక 'జీవితం కోసం పని చేయాలి కానీ, పని కోసం జీవితం నాశనం చేసుకోకూడదు' అనే జెన్ Z నినాదం కొత్త ఉద్యోగ సంస్కృతికి దారితీస్తోంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గించి, జీవన నాణ్యత పెంచే దిశగా సరికొత్త పద్ధతులు సమాజానికి కొత్త దారులు చూపుతున్నాయి.






