- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విధమైన రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా.. ? ఈ రిస్క్ నుంచి మిమ్మల్నెవరూ కాపాడలేరిక..!
ఆ విధమైన రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా.. ? ఈ రిస్క్ నుంచి మిమ్మల్నెవరూ కాపాడలేరిక..!

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో పలు సోషల్ మీడియా వేదికల్లో రీల్స్ స్క్రోల్ చేయని వారు, షార్ట్స్ చూడనివారు ఎవరైనా ఉంటారా? నో అనే కదా మీ సమాధానం..! కానీ జర జాగ్రత్త. ఎందుకంటే.. గంటల తరబడి అలా చేయడం ఆరోగ్య రీత్యా ప్రమాదమని న్యూరోసైన్స్ తాజా పరిశోధనలు చెబుతున్నాయి. లిమిటెడ్‌గా చూస్తే పర్వాలేదు. కానీ షార్ట్ ఫార్మ్-కంటెంట్‌ను అధికంగా చూడటం మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు.
న్యూరో సైన్స్ పరిశోధకుల ప్రకారం.. షార్ట్ ఫార్మ్ కంటెంట్(such as Reels, and Shorts) అధిక వినియోగం మెదడునును నియంత్రిస్తుంది. దీంతో శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వంటివి తగ్గుతాయి. అంతేకాదు రీల్స్ అధికంగా వీక్షించడం తరచుగా మద్యం (Alcohol) వినియోగం కంటే కూడా 5 రెట్లు అధిక నష్టాన్ని కలిగిస్తుందని, మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని తాజా పరిశోధన పేర్కొన్నది. ఎందుకంటే షార్ట్ కంటెంట్(వీడియోలు) వాస్తవానికి వాటిని డోపమైన్ స్పైక్‌లను వేగంగా అందిస్తాయి. అంటే మెదడులో శారీరక సహజమైన చర్యలకు భిన్నంగా సెరోటోనిన్ (తృప్తి కలిగించే రసాయనం) పెరుగుదలను అధికంగా ప్రేరేపిస్తాయి.
రీల్స్ స్క్రోల్ చేసే సందర్భంలో వాస్తవానికి ప్రతీ స్వైప్‌లో కొత్త రకమైన, ఆసక్తికరమైన అనుభవాన్ని పొందుతారు. కానీ ఇలా రీల్స్ లేదా షార్ట్స్ స్క్రోల్ చేయడం కొద్దీ ఆ పరిస్థితి మీలో మెదడులో తక్షణ సంతృప్తి కలిగించే కోరికను పెంచుతుంది(Increases the brain's desire for instant gratification). దీనివల్ల అదొక వ్యసనంగా మారి, చదువు, అధ్యయనం, రోజువారీ పనులపై శ్రద్ధను కోల్పోయేలా చేస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి తరచుగా కొనసాగితే మెదడు సామర్థ్యం దెబ్బతింటుందని, కాబట్టి షార్ట్స్, రీల్స్ వంటివి అధిక సమయం స్క్రోల్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.






