అదేమైనా పెద్ద కష్టమా..? ఎమర్జెన్సీలో ఫ్లైట్‌ను ఈజీగా ల్యాండ్ చేస్తామంటున్న అమెరికన్ యూత్.. అతి విశ్వాసమంటూ కొట్టి పారేస్తున్న నిపుణులు..!!

by Javid Pasha |   (  Updated:2025-05-22 13:24:04  IST  )

Flight & emergency : అదేమైనా పెద్ద కష్టమా..? ఎమర్జెన్సీలో ఫ్లైట్‌ను ఈజీగా ల్యాండ్ చేస్తామంటున్న అమెరికన్ యూత్.. అతి విశ్వాసమంటూ కొట్టి పారేస్తున్న నిపుణులు..!!

అదేమైనా పెద్ద కష్టమా..?  ఎమర్జెన్సీలో ఫ్లైట్‌ను ఈజీగా ల్యాండ్ చేస్తామంటున్న అమెరికన్ యూత్..  అతి విశ్వాసమంటూ కొట్టి పారేస్తున్న నిపుణులు..!!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో జర్నీ చేయడమంటే పెద్ద రిస్కుతో కూడి ఉండేది. ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే అవస్థలు తప్పేవి కావు. కానీ ఇప్పుడలా కాదు. రోడ్డు మార్గాలు మొదలు ఆకాశ మార్గాల వరకు ప్రయాణం చాలా సులభతరమైంది. ఇక వివిధ దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఫ్లైట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఎదురైతే ఫ్లైట్ నడిపే వ్యక్తికి.. అంటే పైలట్‌కు దానిని సురక్షితంగా ల్యాండ్ చేయాలంటే ముందస్తు శిక్షణ, నైపుణ్యం చాలా అవసరం. కానీ అమెరికన్ యూత్ మాత్రం అలాంటిదేం అవసరం లేకుండానే చేయొచ్చని భావిస్తున్నట్లు YouGov సర్వే పేర్కొన్నది. ఇది వారిలో అతి విశ్వాసానికి అద్దం పడుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశ్వాసం ఉంటే పర్లేదు.. కానీ అతి విశ్వాసం మాత్రం కొంపలు ముంచుతుంది. నమ్మకం మంచిదే కావచ్చు. కానీ అతినమ్మకమే ఇబ్బందుల పాటు చేస్తుంది. అయితే అమెరికన్ యువత పరిస్థితి అట్లనే ఉందని YouGov సర్వే పేర్కొన్నది. ఎందుకంటే ఇక్కడి యువతలో సుమారు 46% మంది పురుషులు ఎటువంటి ఫ్లైట్ శిక్షణ లేకుండా కూడా ట్రాఫిక్ కంట్రోల్ (ATC) మార్గదర్శకత్వంతో కమర్షియల్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలమని నమ్ముతున్నారు. సర్వేలో భాగంగా నిపుణులు 20,063 మంది అమెరికన్ వయోజనులను ప్రశ్నించగా, మొత్తం 32% మంది (పురుషులు, మహిళలు కలిపి) తాము విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలమని భావిస్తున్నారు. అయితే పురుషులలో ఈ నమ్మకం దాదాపు 46%కి చేరుకుందని సర్వేలో వెల్లడైంది. కాగా ఏవియేషన్ నిపుణులు ఈ నమ్మకాన్ని అతిగా అంచనాగా, అతి విశ్వాసంగా పేర్కొంటూ శిక్షణ లేకుండా విమానాన్ని ల్యాండ్ చేయడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిపుణులు, నెటిజన్లు క్యూరియాసిటీతో స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Next Story