- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beauty Tips: సంక్రాంతి స్పెషల్..అందమైన రంగవల్లుల్లా మెరిసిపోవాలంటే ఈ టిప్స్ పాటించండి
Beauty Tips: సంక్రాంతి(Sankranti) పండగ పూట అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ ఈ చిన్న చిన్న బ్యూటీ టిప్స్(Beauty Tips) పాటిస్తే..నలుగురిలో మీరే అందంగా కనిపిస్తారు. ఆ టిప్స్ ఏంటో చూద్దామా?

Beauty Tips: అందంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఫంక్షన్లు, పండగల సమయంలో నలుగురిలో తానే అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్టులను వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు. ఆ బ్యూటీ ప్రొడక్టులు(Beauty Tips) తాత్కాలిక అందాన్ని ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పదు.
అయితే ఈ సంక్రాంతి(Sankranti Special) పండగక్కి మీరు ట్రెండీ లుక్ లో కనిపించాలనుకుంటే ఈ బ్యూటీ టిప్స్ (Beauty Tips)ఫాలో అవ్వడి. మీ వాకిట్లో వేసిన రంగవల్లుల్లా అందంగా మెరిసిసోతుంటారు. ఇంతకీ ఆ బ్యూటీ టిప్స్(Beauty Tips) ఏంటీ అనుకుంటున్నారా. అయితే చూద్దాం.
తేనె, నిమ్మరసం:
నిమ్మరసం(Lemon), తేనె(Honey) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉణ్నాయి. ఆరోగ్యంపరగానే కాదు అందానికీ ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. తేనె, నిమ్మరసంతో ఇంట్లో ఇలాఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో సమానంగా తేనె, నిమ్మరసం తీసుకోండి. ఆ రెండింటినీ బాగా కలపండి. శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి.. ఆ తర్వాత చల్లని వాటర్ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నిమిషాల్లోనే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
టమాటాతో గ్లోయింగ్:
వంటకాల్లో వాడే టమాటాను ఉపయోగించి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ముందుగా టమాట(Tomato)ను ముక్కలుగా కోసి దాని గుజ్జుతో ముఖానికి రుద్దుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత ముఖం కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇదే కాదు ఐస్ క్యూబ్ తో ముఖానికి రుద్దుకున్నా చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుందని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
మేకప్ ఇలా వేసుకుంటే..
- ముందు మీరు వేసుకుంటున్న డ్రెస్ సెలక్ట్ చేసుకోవాలి. దాని ప్రకారమే మేకప్ వేసుకుంటే బాగుంటుంది.
-ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పెదాలకు లిప్ బాప్ రాసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు పొడిబారకుండా మెరుస్తూ ఉంటాయి.
-తర్వాత మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి. ఇది స్కిన్ లోకి ఇంకిపోయేలా స్మూత్ గా రుద్దుకోవాలి. తర్వాత ప్రైమర్ రాసి మీ చర్మానికి సరిపడే ఫౌండేషన్ అప్లయ్ చేసుకోవాలి.
-కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే వాటిని కన్సీలర్ తో కవర్ చేయాలి. ఇప్పుడు ముఖానికి పౌడర్ లైట్ గా వేసుకోవాలి.
-లిపిస్టిక్ వాడే అలవాటు ఉన్నట్లయితే పెదాలకు నప్పే రంగు వేసుకుంటే చాలు మీ లుక్ అదిరిపోతుంది. ఓసారి ట్రై చేసి చూడండి.
హెయిర్ స్టైల్ :
ఇక హెయిర్ స్టైల్(Hairstyle) విషయానికి వస్తే చాలా మంది హెయిర్ లీవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ మీరు సెలక్ట్ చేసుకున్న డ్రెస్సింగ్ ప్రకారం మీకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్ సెలక్ట్ చేసుకోవాలి. వాటిపైకి గాజులు, చెవి దుద్దులు , మెడలో హారాలు ఇలా వేసుకుంటే అందంగా కనిపిస్తారు.






