- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Monalisa.. ఓవర్‌నైట్ సెలబ్రిటీ.!

ప్రయాగ్ రాజ్..
మహా కుంభమేళాతో వెలిగిపోతోంది.
చిత్ర విచిత్రాలు.
వింతలు విశేషాలెన్నో.
ఒంటిపై విష సర్పాలతో నాగసాధు.
ముళ్లకంపపై నిద్రిస్తున్న అఘోరా.
ఆడంబరంగా గోల్డెన్ బాబా.
జీవితసారం చెప్తున్న ఐఐటీ బాబా.
సాధువుగా మారిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
ఇలాంటి ఎన్నో సన్నివేశాలను పక్కకు నెట్టేసిందొక యువతి.
అందరి కళ్లూ ఆమె కళ్లనే చూస్తున్నాయి.
చర్చలన్నీ ఆమె అందం మీదనే సాగుతున్నాయి.
ఇంతకూ ఎవరామె..?
మహా కుంభమేళాను సైతం నెట్టేసి.. మీడియా దృష్టినంతా తనవైపు తిప్పిన ఆ నెట్టింటి స్టార్ మోనాలిసా భోంస్లే. కుంభమేళాలో రుద్రాక్ష దండలు.. పూసలదండలు అమ్ముకునే మోనాలిసా తన అందంతో ఓవర్‌నైట్ స్టార్ అయింది. సినీ తారలకు తీసిపోని సోయగంతో సోషల్ మీడియాను, మీడియాను ఒంటి చేత్తో ఊపేస్తోంది మోనాలిసా. ఇలా మోనాలిసా అయినట్లు ఇటీవల చాలామందే ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యారు.
నేచురల్ బ్యూటీ
మహా కుంభమేళాలో ఐఐటీ బాబా, గ్లామరస్ సాధ్వీ హర్ష రిచారియా కనిపించి వారి వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత వాళ్లందర్నీ పక్కకు నెట్టేసి కుంభమేళా కవరేజీనంతా తనవైపు తిప్పేసింది మోనాలిసా. నేషనల్ మీడియా ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం పోటీలు పడుతోంది. కాటుక దిద్దిన తేనెకళ్లు.. డస్కీ స్కిన్.. సింపుల్ హెయిర్ స్టయిల్.. అందమైన చిరునవ్వు.. అద్భుతమైన ముఖారవిందం.. మొత్తానికి ఆమె ఒక నేచురల్ బ్యూటీ. ఆ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నెటిజన్లు ఊకుంటరా.? "గోదారి గట్టు మీద రామసిలకావే", "రాతిరి చీకటిలో ఈ నగరం నిదరోతుంది.. నా నిదురను దోచేసే రూపం నీదయ్యిందీ", "ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వూ.. నాలో అలజిడి రేపిందే నీ చిరునవ్వూ", "లావణ్యం ఆ చెలి పేరు.. సౌందర్యం అమ్మడి ఊరు", "నా చూపే నిను వెతికినదీ.. నీ వైపే నను తరిమినదీ", "తారలెన్ని ఉన్నా ఈ తలుకే నిజం" అంటూ పాటల ద్వారా ఊదరగొడుతున్నారు.
ఇంటికి వెళ్లినా..
నెటిజన్లు మోనాలిసాకు పెట్టిన ముద్దు పేరు "బ్రౌన్ బ్యూటీ". అమాయకపు చూపు, ముగ్ధమనోహరమైన తన రూపమే ఇంటర్నెట్‌కు కంటెంట్ అయ్యింది. కుంభమేళాకు వచ్చిన వాళ్లను తన నీలి రంగు కళ్లతో కట్టిపడేసి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయింది. అదే తన వ్యాపారానికి సమస్యగా మారింది. యాత్రికులు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కానీ ఒక్కరుకూడ గిరాకీ చేయడం లేదట. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా.? ఇక విసిగిపోయింది మోనాలిసా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లిపోయింది. ఐనా తగ్గేదేలే అని వాళ్లింటిని వెతుక్కుంటూ క్యూ కడుతున్నారు కొందరు. ఇంకా కొందరైతే మోనాలిసాకు సినిమా ఛాన్సులొచ్చాయని కూడా చెప్తున్నారు. ప్రయాగ్ రాజ్‌లో అంతపెద్ద క్రతువు జరుగుతుంటే.. దాన్నలా వదిలేసి పాపం.. తన పనేంటో తాను చేసుకుంటున్న మోనాలిసా వైపు ఈ దృష్టి మరలడాన్ని ఏమనాలో వారికే తెలియాలి.
కోయారే కోయ్ గురప్ప
మోనాలిసా వెలుగులోకి రాకముందు జనాల దృష్టంతా మీసాల గురప్ప మీదనే ఉండేది. పొద్దున లేస్తే ఒకటే "కోయారే కోయ్ కోయ్ కోయా.. భామారే సందమామా" అంటూ సావగొట్టి చెవులు మూసే ప్రయత్నం చేశారు. ఆ ప్రతయ్నం ఇంకా నడుస్తూనే ఉంది. యూట్యూబర్స్ క్యూ కట్టారు ఇంటర్వ్యూల కోసం. 2024 డిసెంబర్ 31 సందర్భంగా ఈ పాట వైరల్ అయింది. అదెప్పుడో రెండేళ్ల కింద పాడిందే అయినా దాన్నెవరో నెట్టింట్లో ట్రోల్ చేశారు. దెబ్బకు అది వైరలై ఇయర్ ఎండ్ వేడుకలు "కోయారే కోయ్ కోయ్" డీజే చప్పుళ్లతో ముగిసాయి. భద్రాచలంలోని కోయ తెగకు చెందిన పాస్టరే ఈ మీసాల గురప్ప. మూఢ నమ్మకాలతో ప్రపంచానికి దూరంగా బతుకుతున్న కోయ తెగ ప్రజలను చైతన్యపరిచేందుకు తనదైన చమత్కారంతో పాటలు పాడుతుంటాడు గురప్ప. ఆ చమత్కారమే ఆయన్ను ఓవర్‌నైట్ సెలబ్రిటీని చేసింది. ఇంకేముందీ ఎక్కడ చూసినా "కోయారే కోయ్ కోయ్ కోయా" రీసౌండ్ వినిపిస్తోంది.
సంక్రాంతి బుల్రాజు
కొలికేతాను కొలికేతాను అంటూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రచ్చ చేసిన బుడ్డోడే ఈ బుల్రాజు. అసలు పేరు రేవంత్. మనోడు తిట్ల పురాణం ఎత్తుకుండంటే చెవులు తూట్లు పోవాల్సిందే. "ఓటీటీలు చూసి మావోడు చెడిపోయాడండీ" అనే డైలాగ్ ఒక్కటిచాలు బుల్రాజు ఎంత భీభత్సం చేశాడో. ఈ రెండు మూడు సీన్లతో హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజొచ్చింది ఈ బుడ్డోడికి. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియాకు కంటెంట్ అయ్యాడు. మీమర్స్‌కు మంచి సరుకయ్యాడు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు బుల్రాజు బుల్డోజర్ డైలాగులే రచ్చ చేస్తున్నాయి.
లేడీ అఘోరీ
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు తెలుసు కదా. అప్పుడు ఆ ఆలయంలో ప్రత్యేక పూజాలు జరిపారు. ఆ పూజలు జరిపింది లేడీ అఘోరీ. పేరు నాగ. ఇక అప్పటి నుంచి అఘోరీమాత బిగ్ న్యూస్ అయింది. మీడియా చానెళ్లలో ఇంటర్వ్యూలు షురూ అయ్యాయి. దీపావళి రోజున ఆత్మార్పణం చేసుకుంటానని, పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయని, వెయ్యికి పైగా శవాలను తిన్నా అని అఘోరీ చెప్పడంతో చర్చ పెద్దదైంది. అయితే నాగ అఘోరీ అసలు అఘోరీ కాదనీ, తనొక ట్రాన్స్ జెండరనీ, తనది మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి అనే వార్తలు బయటకు రావడంతో అఘోరీ సైలెంటయ్యింది. తనపై ట్రోల్స్ చేస్తున్న వారిని అంతం చేస్తానని హెచ్చరించడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది.
కుమారీ ఆంటీ
మీవి మొత్తం వెయ్యి రూపాయలు అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుమారీ ఆంటీ.. ఆ ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయింది. ఆమెది ఐటీ కారిడార్లో చిన్నపాటి తోపుడుబండి. దానిపై మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్, తలకాయ కూర, బోటీ ఫ్రై, బగారా వంటివి పెట్టుకొని చాలాకాలం నుంచి అమ్ముతోంది. ఆమె చురుకుదనం, వ్యాపారాన్ని నడిపించే విధానం, కస్టమర్లను రిసీవ్ చేసుకునే తీరు నచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఎవరో. ఇక ఆ కథ సీఎం దాకా వెళ్లింది. కుమారీ ఆంటీ ఇంటర్వ్యూల కోసం యూట్యూబర్లు ఎగబడే పరిస్థితి వచ్చింది. అంతకన్నా ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నా సోషల్ మీడియా లేపిన గత్తరకు అందరి దృష్టి కుమారీ ఆంటీ టిఫిన్ సెంటర్ వైపు మళ్లింది.
అమ్మపాడే జోలపాట
జాహ్నవి యెర్రం తెలుసు కదా.? అమ్మపాడే జోల పాట పాటతో నెట్టింట్లో సంచలనం సృష్టించింది. ఆ ఒక్క పాటనే తనను సెలబ్రిటీని చేసింది. ఈ పాట విడుదలైన 2 రోజుల్లోనే కోటికిపైగా వ్యూస్ సంపాదించింది. జాహ్నవి పుట్టి పెరిగింది ముంబైలో. తెలుగు రాదు. కానీ అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన అమ్మపాటను పాడి అందరి మనసులనూ దోచింది.
కచ్చా బాదాం
బాదాం బాదాం కచ్చ బాదాం అంటూ అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసిన భూబన్ బద్యాకర్ గుర్తున్నాడా.? సోషల్ మీడియా పుణ్యాన సెలబ్రిటీ అయిపోయి ఎంతో సంపాదించాడు. తర్వాత అంతా పోగొట్టుకున్నాడు. సేమ్ ఇతడిలాగే ఏక్ ప్యార్ కా నగ్మా హై పాటతో ఫేమసైంది రేణు మొండాల్. కానీ తర్వాత ఆమెను కూడా అదే సోషల్ మీడియా జీరోను చేసేసింది. బర్రెలక్క, డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన రాదూ బాయ్, అయ్యయ్యో వద్దమ్మా శరత్ ఇలా ఎందరో ఉన్నారు.
డిజిటల్ బాబా
కుంభమేళాలో హల్ చల్ చేస్తున్న ఇంకొకరు డిజిటల్ బాబా. పూర్తిపేరు స్వామి రాంశంకర్ దాస్. హిమాచల్ ప్రదేశ్లోని నాగేశ్వర్ మహరాజ్ ఆలయంలో ప్రవచనకర్త. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా ఆధ్యాత్మిక సందేశాలిస్తూ డిజిటల్ బాబాగా ఫేమసయ్యాడు. అలాగే కుంభమేళా నుంచి వైరల్ అవుతున్న మరో క్రేజీ పర్సన్ హర్ష రిచాలియా. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అయిన రిచాలియా సడెన్‌గా కుంభమేళాలో కనిపించి నెట్టింట సెన్సేషన్ అయిపోయింది.