- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mars video : మార్స్‌పై అందమైన రాత్రి.. ఆ వెన్నెల వెలుగులెంత అద్భుతమో!
Mars video : మార్స్‌పై అందమైన రాత్రి.. ఆ వెన్నెల వెలుగులెంత అద్భుతమో!

దిశ, ఫీచర్స్ : సౌర కుటుంబంలోని అనేక ప్లానెట్స్‌లో మార్స్ ఒకటి. ఎరుపు రంగులో కనిపించే ఈ అంగారకుడిని సూర్యుడికి నాలుగవ గ్రహంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఇది ఐరన్ (III) ఆక్సైడ్ ధూళితో కప్పబడి ఉంటుంది. జీవం ఉనికి ఉండే అవకాశమున్న గ్రహం కాబట్టి అంగారకుడిపై నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ రెడ్ ప్లానెట్‌పై రాత్రి వాతావరణం, వెన్నెల వెలుగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వివరాలేమిటో చూద్దాం.
సహజంగానే అంగారకుడు అందమైన గ్రహమని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అలాంటి చోట రాత్రి వాతావరణం ఎలా ఉంటుంది? ఆకాశంలో నక్షత్రాలు, వెన్నెల వెలుగులు ప్రసరిస్తుంటే ఎలా ఉంటుంది? అచ్చం మన భూమిపై ఉన్నట్లే ఉంటుందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది. ఆ ప్రయత్నమే నాసా కూడా చేసింది. మార్స్‌పై తిరుగాడుతున్న నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’లో రికార్డయిన వెన్నెల రేయి రాత్రి వాతావరణాన్ని బంధించిన నాసా అందుకు సంబంధించిన వీడియోను తన అధికారికి ఎక్స్ (ట్విట్టర్)వేదికగా పోస్ట్ చేసింది.
నిజానికి భూమిపై నుంచి ఆకాశంవైపు చూస్తే అందమైన వెన్నెల, మిణుకు మిణుకు మనే నక్షత్రాలు, నిర్మలమైన ఆకాశం వంటి అందమైన, ఆహ్లాదకరమై వాతావరణాన్ని చూడవచ్చు. కానీ ప్రస్తుతం భూమిపై నగర జీవితంలో, విద్యుద్దీపాల వెలుగుల్లో అది సాధ్యం కాదు. పట్టణాలకు దూరంగా ఏ పల్లెటూరిలోనో, అడవి తల్లి ఒడిలోనో రాత్రిళ్లు సేదతీరితే తప్ప అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని, విశ్వంలోని వింతలను ఆస్వాదించలేం. కానీ అంగారకుడిపై అలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ జనాలుండరు. కాంతి కాలుష్యం, రణగొణ ధ్వనులు ఏవీ ఉండవు. పైగా భూమిపై గల వాతావరణంతో పోలిస్తే అక్కడి వెదర్ చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి అంగారకుడి భూమిపైకి దాని ఆకాశం నుంచి వచ్చే వెన్నెల వెలుగు నేరుగా ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మార్స్‌పై వెన్నెల కాచే రోజుల్లో, ముఖ్యంగా మన భూమిపై పౌర్ణమి రోజు వంటి రోజుల్లో, అంగారకుడి భూమి, ఆకాశం వెన్నెల కాంతులను సంతరించుకుంటుంది. చల్లని వాతావరణంతో అలరిస్తుంది. నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’లో రికార్డయిన వీడియోలో అక్కడి వెదర్‌ను మీరూ ఆస్వాదించవచ్చు. ఇంకెందుకాలస్యం.. ఓ లుక్కేయండి!
What Mars at night may look like... pic.twitter.com/W8UhEvCq1L
— Curiosity (@MAstronomers) January 18, 2025
video credits to mastronomers on x handle






