- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: మెగాస్టార్ పై బాలయ్య డైరక్ట్ అటాక్...నామరూపాలు లేకుండా పోయారు అంటూ...మాటల దాడి
Balakrishna: హిందూపూర్ లో జరిగిన పద్మభూషణ్ సన్మానసభలో నందమూరి బాలకృష్ణ మరోసారి చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: Balakrishna: హిందూపూర్ లో జరిగిన పద్మభూషణ్ సన్మానసభలో నందమూరి బాలకృష్ణ మరోసారి చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎంతోమంది వచ్చారని, కానీ ఆ తరువాత వారంతా నామరూపాలు లేకుండా పోయారని, రాజకీయాలకు కేవలం వస్తే సరిపోదని ప్రజలకు సేవ చేయాలని అందుకే తనను హిందూపూర్ ప్రజలు మూడుసార్లు గెలిపించారని బాలయ్య నేరుగా మెగా స్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని అటు ఇంటర్నెట్లో అభిమానులు మండిపడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య వెండితెర పైన ఉన్న రైవలరి అందరికీ తెలిసిందే. అయితే అది కేవలం సినిమాలకే సరిపోలేదు రాజకీయ రంగంలో కూడా వీరిద్దరూ వేరువేరు పార్టీల వైపు చేరి ఒకరిపై ఒకరు వాగ్బాణాలు వేసుకున్నారు. గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి సైతం కౌంటర్ ఇస్తూ బాలయ్య పేరులోనే బాలుడు ఉన్నాడని అలాంటి మాటలను తాను పట్టించుకోనని అప్పట్లో కౌంటర్ ఎటాక్ చేశారు.
ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరం అవగా, బాలయ్య మాత్రం హిందూపూర్ ఎమ్మెల్యే అయి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా మాటల యుద్ధం లేదు. ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా టిడిపి తో పొత్తు పెట్టుకొని 2024 ఎన్నికల్లో విజయం సాధించి ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి మెగా శిబిరం నందమూరి శిబిరం మధ్య సామరస్య పూర్వకంగానే సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఆ మధ్య నందమూరి బాలకృష్ణ 50 వసంతాలు సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు బాలయ్యతో కలిసి తాను నటిస్తానని కథ సిద్ధం చేసుకోమని దర్శకులకు సవాలు సైతం విసిరారు. కానీ తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయా అని నెటిజెన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్
— greatandhra (@greatandhranews) May 5, 2025
ఎంతో మంది నటులు వచ్చారు.. నామరూపాలు లేకుండా పోయారు.. నేను పనులు చేశా.. pic.twitter.com/RNqnIAS1SY






