- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటి మీద నూలు పోగు లేకుండా జంటగా ఆ పని..! ఏం జరుగుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఒంటరిగానైనా సరే.. జంటగా నైనా సరే అరగంట సేపు ఆ పనిలో నిమగ్నమైపోండి.. ఆ తర్వాత మీరు ఆనంద పారవశ్యంలో మునిగితేలుతారు. మధురానుభూతికి లోనవుతారు. తరచుగా ఇలా చేస్తూ ఉంటే..

దిశ, ఫీచర్స్ : ‘‘మనసులో ఆందోళనగా, అనీజీగా అనిపిస్తోందా.. అలసట వేధిస్తోందా ? అయితే ఏమాత్రం ఆలోచించకండి.. ఒంటిమీద నూలు పోగులేకుండా ఆ గదిలోకి ప్రవేశించండి. ఒంటరిగానైనా సరే.. జంటగా నైనా సరే అరగంట సేపు ఆ పనిలో నిమగ్నమైపోండి.. ఆ తర్వాత మీరు ఆనంద పారవశ్యంలో మునిగితేలుతారు. మధురానుభూతికి లోనవుతారు. తరచుగా ఇలా చేస్తూ ఉంటే.. మీరు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘాయుష్షు మీ సొంతం అవుతుంది’’ అంటున్నారు అక్కడి నిపుణులు. ఇంతకీ ఏం పనో అనే కదా మీ సందేహం.. ! Let's go and read this story..!
ఒంటిమీద నూలు పోగు లేకుండా మీరు ఒక్కరు గానీ, పార్ట్‌నర్‌తో కలిసి గానీ చేయాల్సిన పని ఏంటంటే.. టబ్ బాత్ (Tub bath) అంటున్నారు జపనీస్ ప్రకృతి వైద్య నిపుణులు. అవునా.. అని ఆశ్చర్యపడకండి. ఇది నిజంగా పనిచేస్తుందనే విషయం పరిశోధనల్లోనూ తేలింది. హైడ్రోథెరపీ అండ్ బాత్ టబ్ స్నానాలపై 2018 లోజరిగిన జర్నల్ ఆఫ్ క్లినికల్ రూమటాలజీ (Rheumatology) అధ్యయనం, అలాగే 2020లో జపాన్‌లో ఒన్సెన్ సంప్రదాయంపై నిర్వహించిన అధ్యయనం(International Journal of Biometeorology), 2021లో చర్మ ఆరోగ్యంపై వైద్య నిపుణుల అధ్యయనం (Dermatology Reports), 2025లో, అంటే.. ఇటీవల జరిగిన తాజా అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.
వ్యక్తులు ఒంటరిగా లేదా పెళ్లైన వారు జంటగా కూడా ఒంటిమీద నూలు పోగు లేకుండా పూర్తి నగ్నంగా స్నానం చేస్తే డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీరంలో అన్ని అవయవాల పనితీరును సమన్వయ పర్చడంలో పరోక్షంగా కీ రోల్ పోషిస్తాయి. అలాగే 40 ఏండ్లు పైబడిన వారు నగ్నంగా టబ్ బాత్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పులు, అలాగే కండరాల నొప్పులు తగ్గుతాయని, శరీరంలో రక్త ప్రసరణ మెరుగై, స్ట్రెస్ యాంగ్జైటీస్ వంటివి కూడా తగ్గుతాయని జపనీస్ ప్రకృతి వైద్య నిపుణుల అధ్యయనం పేర్కొన్నది. అంతేకాదు నగ్నంగా టబ్ బాత్ చేయడంవల్ల బీపీ పేషెంట్లలో అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా స్పష్టం చేసింది.
Nude bathing : నగ్నంగా స్నానం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు : చర్మం.. మనసు, శరీరానికి బూస్ట్!






