Nude bathing : నగ్నంగా స్నానం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు : చర్మం.. మనసు, శరీరానికి బూస్ట్!

by Javid Pasha |   (  Updated:2025-08-09 13:03:29  IST  )

Nude bathing : నగ్నంగా స్నానం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు : చర్మం.. మనసు, శరీరానికి బూస్ట్!

Nude bathing : నగ్నంగా స్నానం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు : చర్మం.. మనసు, శరీరానికి బూస్ట్!
X

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ.. ప్రతి రోజూ స్నానం చేస్తారు. అయితే కొందరు టవల్ కట్టుకునో, లో దుస్తులు అలాగే ఉంచో చేస్తుంటారు. బాత్ రూములు లేని పరిస్థితుల్లోనో.. ఆరు బయట స్నానం చేయాల్సి వచ్చినప్పుడో ఇలా చేయడం వేరు. కానీ ప్రస్తుతం అందరి ఇండ్లల్లోనూ బాత్ రూములు ఉంటున్నాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయడం (Nude bathing) ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కలిగే బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం.

* స్కిన్ హెల్త్ : నగ్నంగా స్నానం చేయడంవల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే బట్టలు లేకపోవడంవల్ల చర్మంపై నీటి ఒత్తి వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా లోదస్తులు లేదా టవల్ వంటివి ఉన్నప్పుడు చేసిన స్నానం కంటే.. అవేవీ లేకుండా చేయడం వల్ల శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. చర్మ సంబంధిత సమస్యలను, ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

*మానసిక శ్రేయస్సు : ఒంటిమీద నూలుపోగు లేకుండా స్నానం చేయడంవల్ల శరీరంపై స్వీయ అంగీకార భావం (body positivity) పెరుగుతుంది. ఇది స్వీయ గౌరవాన్ని, మానసిక ఆనందాన్ని కూడా పెంచుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది.

* బాడీ టెంపరేచర్ : నగ్నంగా స్నానం కారణంగా సహజ ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో శరీరం వేగంగా స్పందిస్తుంది. ముఖ్యంగా చల్లని నీటితో స్నానం చేస్తే.. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అయితే సీజన్‌ను బట్టి గోరు వెచ్చని నీరు కూడా ఇదే ప్రయోజనం కలిగిస్తుంది. దీంతోపాటు రక్త ప్రసరణ పెరగడం, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని జర్నల్ ఆఫ్ సైకో థెరపీ (Journal of Physiotherapy) అధ్యయనం పేర్కొన్నది.

ఒంటి మీద నూలు పోగు లేకుండా జంటగా ఆ పని..! ఏం జరుగుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Next Story