- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో ఇద్దరి మధ్య వాదన.. పోలీసులు పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో!
వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. Two men arguing in a bus with a funny twist.

దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని సంఘటనలు ఎంత సీరియస్ అయినప్పటికీ చూస్తుంటే మాత్రం కడుపు చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణికుల మధ్య చాలా సిల్లీ విషయాలకు ఎంతో సీరియస్‌గా వాదనలు చెలరేగుతుంటాయి. ఇలాంటి సంఘటనే ముంబై పోలీసుల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఇలాంటి వినూత్నమైన కంటెంట్‌తో పోస్ట్‌లు చేయడం ముంబాయ్ పోలీసులకు కొత్తేమీ కాదు. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో రియల్ సంఘటనలకు సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈ తాజా పోస్ట్‌లో కూడా ఇలాంటి ఓ ఫన్నీ సంఘటనను పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్ అయ్యింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు బస్సులో ఒకరి పక్కన ఒకరు కూర్చుని సీటులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం గురించి గొడవ పడుతుంటారు. అక్కడ చోటు చాలా ఉందని ఒకరంటే.. ఇక్కడ చోటు లేదని మరొకరు వాదిస్తారు. ఇలా అవే మాటలను పదే పదే అరుస్తూ.. వీరి వాదనలో మరొకరు దూరే ఛాన్స్ కూడా ఇవ్వరు. అందుకే, ఈ వీడియోను "ద్విచక్ర వాహనంలో మూడవ వ్యక్తికి 'స్థలం లేదు'!" శీర్షికతో ముంబయ్ పోలీసులు షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి.






