- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఫ్లాట్ ధర రూ.125 కోట్లు
రియల్ ఎస్టేట్ కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రిషబ్ సత్య.. ఏకంగా 125 కోట్ల ధర పలికిన ప్లాట్..

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ముంబై అంటేనే కాస్లీ రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్. అక్కడ భారీ లావాదేవీలు జరగడం సహజం. ఐతే అలాంటి వాటిల్లో కొన్ని బాగా ఆకట్టుకుంటాయి. ముంబై వర్లిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఏకంగా రూ.125 కోట్లు పలికింది. దాన్ని ప్లిక్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రిషబ్ సత్య కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ యూనిట్ 9,308 చదరపు అడుగుల (864.85 చదరపు మీటర్లు) రెరా కార్పెట్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. దీనికి అదనంగా మరో 328 చదరపు అడుగుల స్థలం కూడా ఉంది. దీంతో మొత్తం విస్తీర్ణం 988.13 చదరపు మీటర్లకు చేరినట్టు రిజిస్ట్రేషన్ పత్రాలను స్పష్టం చేస్తున్నాయి. మార్చి 24న ఇది రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిసింది. ముంబై అత్యంత ప్రముఖ నివాస కేంద్రాలలో ఒకటైన వర్లిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ అనేది విలాసవంతమైన రూపకల్పన, అత్యాధునిక సౌకర్యాలు, సముద్రం వైపు ముఖం కలిగిన లగ్జరీ ప్రాజెక్టు. ఇందులో రెండు టవర్లు ఉన్నాయి, ఇవి 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు, డ్యూప్లెక్సులు, పెంట్ హౌస్‌లను అందిస్తాయి. కేరట్ లేన్ వ్యవస్థాపకుడు మిథున్ సాచేతి సోదరుడు సిద్ధార్థ చేత గత సంవత్సరం ఈ ప్రాజెక్టులో రెండు అపార్ట్ మెంట్లు రూ.160 కోట్లకు కొనుగోలు చేశారు. ఇండియానా గ్రూప్ ఒక యూనిట్‌ను రూ.76 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 ప్రారంభంలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఆ టవర్‌లో ఉన్న తమ అపార్ట్ మెంట్‌ను రూ.80 కోట్లకు విక్రయించారు. అంతకు ముందు షాహిద్ కపూర్, మీరా కపూర్ రూ.60 కోట్లకు ఒక ఇంటిని కొనుగోలు చేశారు.






