- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే సమయంలో ఎన్నో ఉద్యోగాలు.. పెరుగుతున్న పాలీవర్కింగ్ ట్రెండ్
ఈ మధ్యకాలంలో ప్రతి రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో ప్రతి రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసే విధానం కూడా వేగంగా మారిపోతోంది. ఒకే ఉద్యోగంపై ఆధారపడే కాలం నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఇప్పటివారికి, ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేయడం.. అంటే పాలీవర్కింగ్ కొత్త ట్రెండ్‌గా మారింది. టెక్నాలజీ అభివృద్ధి, ఇంటర్నెట్ విస్తరణ, రిమోట్ వర్క్ అవకాశాల వల్ల, పాలీవర్కింగ్ ఇప్పుడు అనేక రంగాల్లో సాధారణంగా మారుతోంది. అమెరికా, యూరప్‌లో ఈ ధోరణి వేగంగా పెరుగుతుండగా, భారతదేశంలో కూడా యువత దీని వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇక ఈ పాలీవర్కింగ్ ట్రెండ్ వెనుక ముఖ్యమైన కారణం.. పెరుగుతున్న జీవన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, తమ ఆసక్తులు, ప్రతిభ, కొత్త విషయాలపై అధ్యయనం వంటి అంశాలు కూడా పాలీవర్కింగ్ వైపు ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదయం ఐటీ ఉద్యోగం చేస్తూ, సాయంత్రం ఫ్రీలాన్స్ రైటర్‌గా పని చేస్తుంటాడు. ఇలా భిన్న రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడం వల్ల ప్రొఫెషనల్ ఎదుగుదలకూ దోహదపడుతోందని నేటితరం యువత భావిస్తోన్నారు.
వోల్ ల్యాబ్స్ సర్వే ప్రకారం 46 శాతం మంది ఉద్యోగులు సెకండరీ జాబ్ చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న మిలీనియల్స్‌లో 52 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 24 శాతం మంది మూడు ఉద్యోగాలు చేస్తున్నారు.
33 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. ఇక జెన్ జెడ్‌లో సగం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీలు పాలీవర్కింగ్’ ట్రెండ్‌కు కారణం. ‘ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ ట్రెండ్ ఉపకరిస్తుంది’ అంటుంది సారా.
కానీ పాలీవర్కింగ్‌కి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సమయ నిర్వహణ, మానసిక ఒత్తిడి, ప్రధాన ఉద్యోగ సంస్థల నియామ నిబంధనలు వంటి అంశాలు సమస్యగా మారవచ్చు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు ఇతర ఉద్యోగాలు చేయడాన్ని నిషేధిస్తున్నాయి. అయినప్పటికీ, సరికొత్త తరం ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పాలీవర్కింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపాన్నే మార్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






