Mother's stress : ముగ్గురు పిల్లలా..? వామ్మో.. వేగలేం బాబోయ్..!

by Javid Pasha |

ముగ్గురు పిల్లలను నిరంతరం కంట్రోల్ చేయడంలో తల్లులు అధిక ఒత్తిడిని, అధిక అలసటను ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొన్నది

Mothers stress : ముగ్గురు పిల్లలా..? వామ్మో.. వేగలేం బాబోయ్..!
X

దిశ, ఫీచర్స్ : ఇద్దరు పిల్లలుంటే నో ప్రాబ్లం.. నలుగురుంటే నో ప్రాబ్లం.. చివరికి ఐదు, ఆరుగురు ఉన్నా నో ప్రాబ్లం.. కానీ వామ్మో ముగ్గురు పిల్లలు ఉంటే మాత్రం భరించడం కష్టం అంటున్నారు కొందరు ముగ్గురు పిల్లలున్న తల్లులు. ఎందుకంటే ఏడుపు, ఆటలు, చదువు, హోం వర్క్ ఇలా రోజువారీ చర్యల్లో వాళ్లను బ్యాలెన్స్‌గా మేనేజ్ చేయడం, మోటివేట్ చేయడం, క్రమశిక్షణలో పెట్టడం, అల్లరిని భరించడం వంటివి తల్లులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నదని టుడే పేరెంట్స్ (TODAY Parents) నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

పేరెంట్స్ టుడే సర్వేలో వెల్లడైన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముగ్గురు పిల్లల దశ (three-child stage) అనేది పిల్లల మధ్య నిరంతరం సాధారణంగా జరిగే గొడవలను, అల్లరిని కంట్రోల్ చేయడంలో తల్లులకు అధిక ఒత్తిడితో కూడిన శ్రమగా మారుతుంది. ఇది వారిని మానసికంగా అలసటకు గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత విషయాలపై, ఆరోగ్యంపై కేటాయించుకునే సమయాన్ని హరిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి తల్లలును శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేస్తుందని సర్వే పేర్కొన్నది. దీంతోపాటు సమాజం నుంచి ‘Enjoy every moment’ అనే ఒత్తిడి తల్లుల్లో అపరాధ భావాన్ని (Feeling guilty) పెంచే అవకాశం ఎక్కువ. ఇటువంటి పరిస్థితులు ముగ్గురు పిల్లలను పెంచడాన్ని ప్రత్యేక ఒత్తిడితో కూడుకున్నదిగా మార్చేస్తాయి. అదే విధంగా సామాజిక అంచనాలు తల్లులు తమ ఒత్తిడిని లేదా కష్టాలను ఓపెన్‌గా వ్యక్తం చేయడానికి వెనుకాడేలా చేస్తాయి. అందుకే వేగడం కష్టం బాబోయ్.. అంటున్నారు ముగ్గురు పిల్లల తల్లులు. Link

Next Story