Mother's Love : 16 రోజుల తర్వాత కోమా నుంచి బయటకొచ్చిన కొడుకు.. తల్లి రియాక్షన్ చూసి గుండె బరువెక్కింది.. కన్నీళ్లు ఆగట్లేదు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-06 04:43:39  IST  )

ప్రతీ తల్లి బిడ్డకు గొప్ప జీవితం ఉండాలని కోరుకుంటుంది. కనీసం తను పడిన కష్టాలు తన బిడ్డకు రాకుండా ఉంటే చాలనే స్వార్థంతో ఉంటుంది. అలాగే పెంచుతుంది.. తనకు ఉన్న దాంట్లో అన్ని సమకూరుస్తుంది. కానీ

Mothers Love : 16 రోజుల తర్వాత కోమా నుంచి బయటకొచ్చిన కొడుకు.. తల్లి రియాక్షన్ చూసి గుండె బరువెక్కింది.. కన్నీళ్లు ఆగట్లేదు..
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ తల్లి బిడ్డకు గొప్ప జీవితం ఉండాలని కోరుకుంటుంది. కనీసం తను పడిన కష్టాలు తన బిడ్డకు రాకుండా ఉంటే చాలనే స్వార్థంతో ఉంటుంది. అలాగే పెంచుతుంది.. తనకు ఉన్న దాంట్లో అన్ని సమకూరుస్తుంది. కానీ కొన్ని సందర్భాలు మన చేజారిపోతాయి. అలాంటిదే ఈ ఘటన కూడా. ఏమైందో తెలియదు కానీ అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు దాదాపు 16 రోజులు కోమాలో ఉన్నాడు. మెళకువకు రాగానే డాక్టర్స్ తల్లికి ఫోన్ చేయగా.. ఆమె పరుగెత్తుకుంటూ వచ్చింది. హాస్పిటల్‌ బెడ్‌పైనే కూర్చుని అమ్మ అని పిలుస్తున్న కొడుకుని హత్తుకుని.. నేనున్నాను భయపడకనే భరోసా ఇచ్చింది.

ఈ హార్ట్ టచింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ క్లిపింగ్ చూసిన నెటిజన్లు.. ఆ తల్లి పరుగెత్తుకొచ్చి పిల్లాడిని హత్తుకోవడం చూస్తుంటే గుండె బరువెక్కుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు నాకెందుకు కన్నీళ్లు వస్తున్నాయని కొందరు అంటుంటే.. ‘‘దిస్ ఈజ్ సో ఎమోషనల్.. లెట్స్ బ్లెస్ ది లిటిల్ హార్ట్’’, ‘‘ఇది ఆ చిన్నారి సంతోషానికి తొలి క్షణం కావాలని కోరుకుంటున్నా’’, ‘‘తల్లి ప్రేమ ముందు ఏదీ సరిపోలదు’’, ‘‘వందేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నా’’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story