ఆన్‌లైన్ పోలీస్.. సోషల్ మీడియాలో యవత భద్రతకోసం స్పెషల్ యూనిట్!!

by Javid Pasha |

అక్కడ ఆన్‌లైన్ స్పేస్‌లలో పోలీస్ ఆఫీసర్లతో కూడిన ఒక ప్రత్యేక యూనిట్ నిరంతరం నిఘా పెడుతుంది. మోసాలను గుర్తించి నివారిస్తుంది.

ఆన్‌లైన్ పోలీస్.. సోషల్ మీడియాలో యవత భద్రతకోసం స్పెషల్ యూనిట్!!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల యువతలో అనేకమంది ఏదో ఒక ఆన్‌లైన్ గేమ్‌లో మునిగితేలుతున్నారు. అలాగే ఇతరులతో నేరుగా కలిసి మాట్లాడే పరిస్థితులకంటే సోషల్ మీడియా గ్రూపుల్లోనో, ఆన్‌లైన్‌ వేదికగానో కన్వర్జేషన్లు కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేదికల్లో వేధింపులు వంటివి కూడా సాధారణం అవుతున్నాయి. అయితే వీటిని అరికట్టడానికి డెన్మార్క్‌ పోలీసులు ఒక సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఏంటంటే.. వారు ఆన్‌లైన్ స్పేస్‌లలో యువత భద్రతకోసం (పొలిటియేట్స్ ఆన్‌లైన్ పట్రుల్జె (Politiets Online Patrulje) అనే ఒక ప్రత్యేక యూనిట్‌ను నడుపుతున్నారు. ముఖ్యంగా కౌంటర్-స్ట్రైక్, ఫోర్ట్‌నైట్, మైన్‌క్రాఫ్ట్, రోబ్లాక్స్ వంటి పాపులర్ గేమ్‌లలో ఇది యాక్టివ్‌గా పాల్గొంటుంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

ప్లేయర్లతో ఇంటరాక్ట్

ఆన్‌లైన్ స్పేస్‌లలో.. ముఖ్యంగా గేమింగ్ స్పేస్‌లలో 10 మంది ఆఫీసర్లతో కూడిన యూనిట్ నిరంతరం నిఘా పెడుతుంది. ఇందులోని పోలీస్ ఆఫీసర్లు తమ వెరిఫైడ్ పోలీస్ అకౌంట్లతో గేమ్‌లలో ప్లేయర్లతో ఇంటరాక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా వారు యువత పరిమితికి మించి ఎక్కువ సమయం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నప్పుడు, అనుమానాస్పద కన్వర్జేషన్లు, వేధింపులు, మోసాలు, సైబర్ నేరాలకు అవకాశం ఉన్న సంభాషణలు వంటివి కొనసాగే అవకాశాన్ని పసిగట్టి కన్వర్జేషన్లను మానిటర్ చేస్తారు. ముఖ్యంగా హరాస్‌మెంట్, గ్రూమింగ్, స్కామ్‌లు లేదా ఇతర ఆన్‌లైన్ మిస్‌కండక్ట్‌లను గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే యాక్షన్‌లోకి దిగుతారు. ఈ విధానంవల్ల అక్కడ ఆన్‌లైన్ వేధింపులు, మోసాలు తగ్గుతున్నాయి.

సమస్య గుర్తించగానే రెస్పాండ్

ప్రత్యేక యూనిట్ ఆఫీసర్లు గేమ్‌లలో ప్లేయర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. సమస్యలు గుర్తించినప్పుడు తక్షణం రెస్పాండ్ అవుతారు. అవసరమైతే రియల్-వరల్డ్ ఇన్వెస్టిగేషన్‌లకు సిద్ధం అవుతారు. ఉదాహరణకు, ఫ్రాడ్, హేట్ స్పీచ్ లేదా పిల్లలను టార్గెట్ చేసే ప్రెడేటర్లను ఆపడానికి ఎనీటైమ్ ఆన్‌లైన్‌లో ఒక పోలీస్ నిఘా కొనసాగుతూ ఉంటుంది. అవసరాన్ని బట్ట ఆఫ్‌లైన్‌లో కూడా యాక్షన్ తీసుకుంటారు. అంతేకాకుండా ట్విచ్ ప్లాట్‌ఫారమ్‌లో గేమింగ్ సెషన్‌లను లైవ్‌స్ట్రీమ్ చేసి, ఆన్‌లైన్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పటివరకు ఈ యూనిట్ వందలాది కేసులలో ఇంటర్వీన్ చేసి సక్సెస్ సాధించింది.

డిజిటల్ వరల్డ్‌లో సేఫ్టీ కోసం

ఈ యూనిట్ సృష్టించడానికి కారణం, యువత ఇంటరాక్షన్ ఫిజికల్ స్పేస్‌ల నుండి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఎన్విరాన్‌మెంట్‌లలో ఉండటం వల్ల మోసాలు, వేధింపులు, ప్రమాదాలను ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతారు. సమస్యలు డిజిటల్ వరల్డ్ దాటి ఎస్కలేట్ అవకముందే అరికడతారు. ఈ విధానం ఇతర దేశాలకు మోడల్‌గా తీసుకోవాలని, ముఖ్యంగా ఇండియాలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని గేమ్‌లు అండ్ ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరించవచ్చు. ఈ అప్రోచ్ ఆన్‌లైన్ సేఫ్టీని ప్రమోట్ చేయడమే కాకుండా, యువత పోలీసుల మధ్య స్నేహపూర్వక సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

Next Story