ఇంటెల్ ఉద్యోగం వదిలేసి.. దోశల బిజినెస్.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:27:46  IST  )

అన్నీ వదిలేసి దోశల దుకాణం పెట్టుకున్నాడు

ఇంటెల్ ఉద్యోగం వదిలేసి.. దోశల బిజినెస్.!
X

దిశ, ఫీచర్స్: లక్షల రూపాయల జీతం వదిలేసి సొంతంగా బిజినెస్‌ల వైపు ఆకర్షితమవుతోంది యువత. అవికూడా టీ స్టాల్.. కాఫీ షాప్.. టిఫిన్ సెంటర్ వంటి అల్పాదాయ వనరులను వెతుక్కుంటోంది. మోహన్ అనే యువకుడు కూడా ఇలాగే చేశాడు. జర్మనీలో ఇంటెల్ వంటి పెద్ద కంపెనీలో అత్యున్నత పదవిలో పనిచేసినా.. అవన్నీ వదిలేసి దోశల దుకాణం పెట్టుకున్నాడు.

దోసమా స్టార్టప్..

ఇంటెల్ వంటి పెద్ద టెక్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి దోశల బిజినెస్ పెట్టి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు మోహన్. పారిస్‌లో స్కాలర్‌షిప్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివిన మోహన్ తర్వాత జర్మనీలో ఇంటెల్.. టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి కంపెనీల్లో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేశాడు. కానీ అవేవి తనకు సంతృప్తి ఇవ్వలేదు. 2023లో స్నేహితులతో కలిసి "దోసమా"ను స్టార్ట్ చేశాడు. దానికి అతను మేనేజింగ్ డైరెక్టర్. ఈ స్టార్టప్ పారిస్‌ నుంచి లండన్.. పుణే వరకు విస్తరించింది. హెల్దీ గ్లూటెన్ ఫ్రీ దోశలతో మోహన్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు.

యూరప్.. పారిస్‌లో..

లక్షల రూపాయల జీతం వదిలేసి దోశల వ్యాపారం చేస్తే "అరే ఇదేం పిచ్చిరా బాబూ" అనుకున్నారంతా. కానీ మోహన్ దానిని ప్యాషన్‌గా భావించాడు. వెక్కిరించిన వాళ్ల ముందు బోర్లాబొక్కల పడొద్దని సక్సెస్ కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. సవాళ్లను ఎదుర్కొన్నాడు. అమెరికా బర్గర్లు.. ఇటలీ పిజ్జాలు భారత్‌కు వచ్చాయి కదా.? మరి భారత్ వంటకాలు పారిస్‌కు ఎందుకు రావద్దని "దోసమా"ని ఓపెన్ చేశాడు. యూరప్.. పారిస్.. లండన్‌లో ఔట్ లెట్లు ఓపెన్ చేశారు. భారతీయ ఆహారపు అలవాట్లను దునియా మొత్తం చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

సంస్కృతి పరిరక్షణకే..

డిసెంబర్ 2025లో పుణేలోని ఎఫ్‌సీ రోడ్‌పై "దోసమా" బ్రాంచ్ ఓపెనింగ్ ఒక మైలురాయి. ఈ బ్రాంచ్‌తో భారత్‌లో మొదటి అడుగు పెట్టాడు. ఏదో తిండి కోసం కాదు.. ఈ మధ్య అందరూ గట్‌హెల్త్.. గట్‌హెల్త్ అని అంటున్నారు కదా.. ఆ గట్‌హెల్త్ కల్చర్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు దోసమా ద్వారా. మోహన్ స్ఫూర్తి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతదేశపు ఆరోగ్యకరమైన ఫుడ్‌ను ప్రపంచానికి పంచుతున్నాడు అని చాలామంది మెచ్చుకున్నారు. ఇది కేవలం కెరీర్ మార్పు కాదు. భారతదేశం రుచులు, సంస్కృతిని పంచుకోవడమే మా లక్ష్యం" అని అతను చెబుతాడు.

Next Story